Hyderabad

News May 4, 2024

సికింద్రాబాద్ ‘సికందర్’ ఎవరు?

image

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ MP కిషన్ రెడ్డి (BJP), దానం నాగేందర్ (INC), పద్మారావు గౌడ్ (BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు BJP, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది. ఈసారి సికందర్ ఎవరో మీ కామెంట్?

News May 4, 2024

HYD: ‘ఎన్నికల తర్వాత మెట్రో రెండో దశ పనులు’

image

లోక్‌సభ ఎన్నికల అనంతరం మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కార్యాచరణ చేపట్టనున్నట్లు HYD మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి తెలిపారు. రెండో దశపై ఇప్పటికే DPRను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కేబినెట్ అనుమతి కోసం DPRను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో మెట్రో రెండో దశ పనులు ప్రారంభమవుతాయన్నారు. LB నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

image

HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. SI శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రితరెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం బాచుపల్లిలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో JNTU సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.

News May 4, 2024

త్వరలో నూతన హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్!

image

చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో నూతన హంగులతో ప్రజలందరికీ అందుబాటులోకి రానుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలివేషన్ డిజైన్ సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, సకల హంగులతో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు ఎలివేషన్, మరోవైపు ఫకాడే, పార్కింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

News May 4, 2024

మల్కాజిగిరిలో పురుషుల ఓట్లే కీలకం!

image

దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.

News May 4, 2024

HYD: బర్త్‌డే కేక్‌ కోసం వెళ్లి బాలుడి మృతి

image

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్‌ కాలనీకి చెందిన బిజ్వి సందీప్‌ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 4, 2024

HYD: 5 నుంచి వేసవి సెలవులు

image

HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: భగ్గుమంటున్న భానుడు!

image

భానుడు భగ్గుమంటున్నాడు. రోహిణి కార్తె రానే లేదు.. అంతలోనే ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రతకు నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు జంకుతున్నారు. అల్లాపూర్ 44.2, కుత్బుల్లాపూర్ 44.1,నాచారం 44.0, ముషీరాబాద్ 44.0,అల్కాపురి కాలనీ 43.9,యాకుత్ పుర, షేక్ పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 43. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

News May 4, 2024

HYDలో రేవంత్ రెడ్డి VS KTR

image

HYD, ఉమ్మడి RRలోని మల్కాజిగిరి, HYD, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, BRS నాయకులతో మాజీ మంత్రి KTR మాట్లాడుతున్నారు. ఈ 9 రోజుల్లో నగరంలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సూచనలు చేస్తూనే ఎవరికి వారు గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు రోడ్ షోలతో హోరెతిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.

News May 4, 2024

HYD: కాంగ్రెసోళ్లు నన్ను ఓడించాలని చూస్తున్నారు: నివేదిత

image

కాంగ్రెసోళ్లు తనపై కక్ష కట్టి ఓడించాలని చూస్తున్నారని BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత అన్నారు. HYD బోయిన్‌పల్లిలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్య నాయకులు కంటోన్మెంట్‌కి వచ్చి తనను ఓడించాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘మా నాన్న చేయి.. నా తలమీద లేనప్పుడు నన్ను ఇబ్బందులు పెడుతున్న వారికి నా కంటోన్మెంట్ ప్రజలే బుద్ధి చెబుతారు’ అని అన్నారు.