India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. 56 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఫిర్యాదులని డీఆర్వో సంగీత స్వీకరించి తాగు చర్యల కోసం సంబంధించిన అధికారులను ఆదేశించారు. రెవెన్యూ- 21, ఇతర శాఖలకు – 35 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు డీఆర్ఓ సంగీత సూచనలు ఇచ్చారు.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్‌కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇది దేశానికి మూడో పతకం.
హైదరాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు అందాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అందిన దరఖాస్తుల్లో గృహ నిర్మాణానికి సంబంధించినవి 18, పెన్షన్ 10, ఇతర శాఖలకు చెందినవి 28 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిటీలో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిపే పుష్పక్ బస్సులకు నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడం, కేవలం 60 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండడంతో రూట్ పాస్‌లు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. సిటీ మొత్తం అయితే రూ.5,200, శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ రూ.2,110, బాలాపూర్ టు ఎయిర్ పోర్టు రూ.3,100, ఎల్బీనగర్, గచ్చిబౌలి టు ఎయిర్పోర్టుకు రూ.4,210 ఖరారు చేయనున్నారు.
గచ్చిబౌలిలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం స్కిల్స్ యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణను స్కిల్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దుతామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. గ్రామీణ యువతకు సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, సీ.అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల, NVSS ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సోమవారం ట్యాంక్‌బండ్ కూడలి వద్ద డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శాసనమండలికి బయలుదేరారు.
వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు TG ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా OUకు సంబంధించి 601 పోస్టులకు 131 మంది పనిచేస్తుండగా 470 ఖాళీలు ఉన్నాయి. JNTUH పరిధిలో 224 పోస్టుల్లో 86 మంది పనిచేస్తుండగా 138 ఖాళీలు ఉన్నాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి 68 పోస్టులు మంజూరు కాగా 23 మంది పనిచేస్తుండగా 45 ఖాళీలు ఉన్నాయి. కొత్త రిక్రూట్మెంట్ కు జీవో 21 జారీ చేసింది.
MMTS రైళ్లలో మహిళల రక్షణకు RPF అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
మహానగరంలోని హోటళ్లలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సిటీలో అనేక చోట్ల అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో నగరంలో ఆరు ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూ.30 కోట్ల నిధులు (ఒక్కో కేంద్రానికి రూ.6 కోట్లు) కావాలని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నివేదికలు పంపారు. నిధులు విడుదలైతే ఫుడ్ టెస్టింగ్ సిటీలో జోరందుకుంటుంది.
Sorry, no posts matched your criteria.