India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ శాఖ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క అధికారులతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పీఆర్ అధికారులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తండోపతండాలుగా ఏకదంతుడి మహారూపం చూడటానికి వస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. శనివారం 2 లక్షల మంది, ఆదివారం 4 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య ఈరోజు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఖైరతాబాద్‌కు వచ్చే బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా HYD హుస్సేన్ సాగర్‌లో ఫ్లోటింగ్ బతుకమ్మ వేడుకల పేరుతో సరికొత్త కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రముఖులను కూడా వేడుకల్లో భాగం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు మంత్రి జూపల్లి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
KPHB కాలనీలో రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ <<17560313>>దంపతులు<<>> ఒకరికొకరు పొడుచుకొని చనిపోవాలని తీసుకున్న నిర్ణయం నిజమా, లేక నాటకమా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరూ చనిపోవాలనుకుంటే భార్య మాత్రమే ఎలా బతికి ఉంది? అదీ 24 గంటలపాటు భర్త భౌతికకాయం వద్ద ఏం చేసిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చికిత్స పొందుతున్న రమ్యకృష్ణ నోరువిప్పితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.
ఆగస్టులో 31 కేసులు నమోదు చేశామని TG ACB ప్రకటించింది. 15ట్రాప్ కేసులు, 2 DA కేసులు, 3 మిస్ కండక్ట్ కేసులు నమోదయ్యాయి. 20మంది ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.2.82లక్షల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. DA కేసులో రూ.5.13కోట్లు, అనుమానాస్పద ఆస్తులు గుర్తించారు. 2025 జనవరి-ఆగస్టు వరకు 179కేసులు నమోదు కాగా 167మంది ఉద్యోగులు లంచం కేసుల్లో పట్టుబడ్డారని ACB తెలిపింది.
స్వీపింగ్ మిషన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేసిన GHMC, అద్దె యంత్రాల కోసం మళ్లీ టెండర్లును పిలిచి నవ్వుల పాలవుతుంది. ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్ జోన్ ప్రాంతాల్లో స్విపింగ్ కోసం దాదాపు రూ.2 కోట్లు చెల్లించేందుకు టెండర్లను పిలిచారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరు, తీసుకునే చర్యలపై స్థానిక జోన్ ప్రాంతాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిమజ్జనాల కోసం RTA వాహనాలు అందించేందుకు సిద్ధమైంది. HYD వ్యాప్తంగా 12వాహన కేంద్రాలను నిమజ్జనాల కోసం గుర్తించింది. ఈ కేంద్రాల నుంచి మండపాలకు వాహనాలు తీసుకెళ్లొచ్చు. నెక్లెస్ రోడ్డు, మేడ్చల్, టోలిచౌకి, జూ పార్క్, మలక్‌పేట, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్‌చేరు, వనస్థలిపురం, ఆటోనగర్ RTA కేంద్రాల నుంచి వాహనాలను మండపాలకు తరలించునున్నారు.
నేటి నుంచి పంజాగుట్టలోని నిమ్స్‌లో చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఈ శిబిరం సెప్టెంబర్ 21 వరకు జరగనుంది. మంగళ, గురు, శుక్రవారాలలో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఆస్పత్రిలో సంప్రదించవచ్చు. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారు.
SHARE IT
మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏడాదిలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలియజేశారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం అల్లకల్లోలం అవుతోందన్నారు.
Sorry, no posts matched your criteria.