Hyderabad

News January 6, 2026

HYD: కొత్తగా వర్క్ ఫ్రమ్ విలేజ్!

image

గజ్వేల్, చౌటుప్పల్ వంటి పల్లెలు ఇకపై వ్యవసాయానికే పరిమితం కావు. గ్రిడ్ పాలసీ పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో 10Gbps ఇంటర్నెట్, సోలార్ పవర్ హబ్‌‌ను ప్రతిష్ఠిస్తోంది. T-Fiber నెట్‌వర్క్‌ను విద్యుత్ పోల్స్ ద్వారా ప్రతి ఇంటికీ అనుసంధానించడం వల్లే ఇది సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. IT కోసం హైటెక్స్‌ వెళ్లకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని విదేశీ ప్రాజెక్టులు చేసేలా ‘వర్క్ ఫ్రమ్ విలేజ్’ ప్లాన్ ఇది.

News January 6, 2026

HYD: జనవరి 8, 9న నీటి సరఫరా బంద్!

image

HYDలో పలు చోట్ల నీటి సరఫరా బంద్ కానుంది. JAN 8న ఉదయం 10 గంటల నుంచి JAN 9న తెల్లవారుజామున 4 గంటల వరకు సింగూరు ప్రాజెక్ట్ మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ కారణంగా మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఫతేనగర్, బాలానగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో 18 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని HMWSSB తెలిపింది.

News January 6, 2026

FLASH: హైదరాబాద్ ఘన విజయం

image

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బరిలోకి దిగిన HYD జట్టులో ఓపెనర్ అమన్ రావు 200* చెలరేగాడు. రాహుల్ సింగ్ (64), తిలక్ వర్మ (34) రాణించారు. 352 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగాల్ 245 పరుగులకే కుప్పకూలింది. కాగా, తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత HYD వరుసగా 2వ విజయం నమోదు చేయడం విశేషం.

News January 6, 2026

HYD: కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు: కాంగ్రెస్‌ MLA

image

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ MLA మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR కూతురు, MLC కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. కాగా, గతంలో ఆయన చెప్పినట్లే దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు. దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ రావాల్సి ఉంది.

News January 6, 2026

వారేవా.. HCUకు అంతర్జాతీయ గుర్తింపు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొ.అనిల్ కుమార్ చౌదరి, స్కాలర్ చందన్ ఘోరుయీ పేలుడు పదార్థాలను గుర్తించి ప్రమాదాల నివారించే పరికరాన్ని రూపొందించారు. 0.3 టెరాహెట్జ్ రాడార్ వ్యవస్థను తయారుచేశారు. ఇది పేలుడు పదార్థాలను, లోహాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది. వీరి పరిశోధన వివరాలు అంతర్జాతీయ IEEE సెన్సార్ జర్నల్‌లో ప్రచురించారు.

News January 6, 2026

HYD: ఈ పథకంతో రూ.50వేలు సాయం

image

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC), ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా మిస్కీనో కే లియే పథకాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి tgobmms.cgg.gov.in పోర్టల్‌లో ప్రారంభమయ్యాయి. మైనారిటీ మహిళా యోజనలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, ఆర్ఫన్లు, సింగిల్ మహిళలకు రూ.50,000 సహాయం పొందవచ్చని మెయినాబాద్ ఎంపీడీవో సంధ్య తెలిపారు.

News January 6, 2026

HYD: తెలుగు చదవలేకపోతున్నారు..!

image

10వ తరగతి విద్యార్థులకు మాతృభాష తెలుగు చదవడం, రాయడం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ HYD వ్యాప్తంగా స్టడీ ఆన్ మదర్ టంగ్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 వేల శాంపిల్స్ పరిశీలించిన బృందం 74.6% మంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం రావడంలేదని తెలిపింది. సర్వేలో 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. ఇందులో మెజార్టీ విద్యార్థులు మాటలకే పరిమితం అవుతున్నట్లు గుర్తించారు.

News January 6, 2026

హైదరాబాద్ నగరానికి యువీ!

image

టీమ్ ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు నొవాటెల్‌లో నిర్వహించనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తన అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్‌పోర్టులో పోటీ పడ్డారు.

News January 6, 2026

బల్దియా.. 3 ముక్కలు అవుతోందయా!

image

పరిపాలనా సౌలభ్యం కోసం GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఉన్న బల్దియాను 6 జోన్ల HYD, 3 జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల బదిలీలు, JCల నియామకాలు జరుగుతున్నాయి. పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త కార్పొరేషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశముంది.

News January 5, 2026

హైదరాబాద్‌లో ‘BTS’ మేనియా!

image

HYD జెన్-జీ కుర్రాళ్లకు పూనకాలు వచ్చాయి. ‘BTS’ కమ్‌బ్యాక్ ప్రకటనతో నేడు 15 మిలియన్ల ట్వీట్లు దాటిపోయి SM షేక్ అవుతోంది. క్రిప్టో మార్కెట్ పడిపోయినా లైట్ తీసుకుని, గ్రోక్ ఏఐ హ్యాక్స్, కోర్టు వార్తల మధ్య కూడా పర్పుల్ వైబ్స్‌తో కేఫ్‌లు మార్మోగుతున్నాయి. ఒత్తిడిని వీడి, యాక్టివిజం మీమ్స్‌తో కుర్రాళ్లంతా మాస్ హిస్టేరియా క్రియేట్ చేస్తున్నారు. 2026 అసలైన ‘స్టానింగ్’ రేసులో మనోళ్ల జోరు మాములుగా లేదు.