Hyderabad

News April 10, 2026

HYD: DGP ఎదుట లొంగిపోనున్న 30మంది మావోయిస్టులు

image

హైదరాబాద్‌లో ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుపోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ.3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోనుండగా, ఇందులో PLGA బెటాలియన్ సభ్యులు ఉన్నట్లు సమాచారం. లొంగుబాటుతో నక్సలిజం నిర్మూలనలో పోలీసులు మరో ముందడుగు వేశారు.

News April 10, 2026

HYD: రాజకీయ నేత కుమారుడి లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

image

హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ రాజకీయనేత కుమారుడి లైంగిక వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని బయటకు చెబితే కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి బాధితులు వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం.

News April 10, 2026

HYD: రేషన్ బియ్యం ఇలా తీసుకోవచ్చు!

image

HYDలో 3 నెలల రేషన్ బియ్యం అర్ధరాత్రి వరకు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీపై డీలర్లు గుడ్‌న్యూస్ చెప్పారు. ఒక నెల రేషన్ బియ్యం ఒకచోట, మిగతా 2 నెలల బియ్యం మరోచోట తీసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ఎక్కడ రేషన్ బియ్యం తీసుకున్నా.. ఆ నెలకు సంబంధించిన వేలిముద్ర వేయాల్సి ఉంటుందని వివరించారు. దీంతో కొందరు HYDలో కొన్ని, గ్రామాల్లో మిగతావి తీసుకుంటున్నారు.

News April 10, 2026

WARNING: HYDలో 10 రోజులు జగ్రత్త!

image

ఉమ్మడి RR, HYD జిల్లాలో సూర్యుడి తాపం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. గరిష్ఠంగా షాబాద్, మహేశ్వరంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 12- 22 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు 40°C- 41°C వరకు కొనసాగనున్నాయి. మల్లాపూర్, ఉప్పల్, బాలానగర్, రాజేంద్రనగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండలో విపరీతమనై ఉక్కపోత ఉండనున్నట్లు వివరించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

News April 10, 2026

HYD నుంచి అయోధ్య, కాశీకి స్పెషల్ ప్యాకేజీ

image

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, 3 పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ.14,500 నుంచి రూ.34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల వారు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News April 10, 2026

HYD: 85% డిస్కౌంట్‌తో సాఫ్ట్‌వేర్ కోర్సులు

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు మణికొండలోని ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు <>ఆన్‌లైన్‌లో<<>> ఈ నెల 25 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. AI, మెషీన్ లెర్నింగ్ వంటి కోర్సుల్లో 85% వరకు రాయితీ ఉంటుందని, ప్రభుత్వం ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందొచ్చన్నారు.

News April 10, 2026

HYD: ప్రియుడి మోజులో భర్తపై హత్యాయత్నం

image

కట్టుకున్న వాడిని కాదని ప్రియుడి మోజులో పడింది.. ముగ్గురు పిల్లల తల్లి లవర్‌తో కలిసి భర్తనే కడతేర్చాలనుకుంది. పోచారం PS పరిధి ఘనపూర్ లింగాపూర్‌కు చెందిన బొట్టు రమేశ్, బాలమణి దంపతులు. బంధువు అమర్‌తో ఉన్న వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో కక్ష పెంచుకుంది. ఈ నెల 7న నిద్రిస్తున్న భర్తను లవర్‌తో కలిసి కర్రలతో దాడి చేసింది. అతడు వేడుకోవడంతో వదిలి వెళ్లారు. బాలమణిని రిమాండ్ చేశారు. అమర్ పరారీలో ఉన్నాడు.

News April 10, 2026

మిస్సింగ్ బైకుకు చలాన్.. HYD పోలీస్ యాక్షన్!

image

3 నెలల క్రితం హబీబ్‌నగర్ PS పరిధిలో చోరీకి గురైన బైక్‌ ట్రాఫిక్ చలాన్‌లో కనిపించిందని ఒకరు ట్వీట్ చేయడం SMలో చర్చనీయాంశమైంది. బైక్ <<19600198>>పోయిందని<<>> ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రహమాన్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఇటీవల ఆ వాహనంపై పడిన చలాన్ ఫొటోలో ఓ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. అయితే, ఆ చలాన్‌ మార్చి 27న నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు గురువారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News April 10, 2026

HYD: TG రెరా కార్యదర్శిగా శ్రీలత

image

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (రెరా) TG కార్యదర్శిగా శ్రీలతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కన్జూమర్ అఫైర్స్, ఫుడ్& సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీలతను డిప్యూటేషన్ బేసిస్లో ప్రభుత్వం రెరా కార్యదర్శిగా నియమించింది. ఇప్పటికే రెరా కార్యదర్శిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి అడిషనల్ కలెక్టర్‌‌గా నియమితులయ్యారు.

News April 10, 2026

మిస్సింగ్ బైకుకు చలాన్.. HYD పోలీస్ యాక్షన్.!

image

3 నెలల క్రితం హబీబ్‌నగర్ PS పరిధిలో చోరీకి గురైన బైక్‌ ట్రాఫిక్ చలాన్‌లో కనిపించిందని ఒకరు ట్వీట్ చేయడం SMలో చర్చనీయాంశమైంది. బైక్ <<19600198>>పోయిందని<<>> ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రహమాన్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఇటీవల ఆ వాహనంపై పడిన చలాన్ ఫొటోలో ఓ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. అయితే, ఆ చలాన్‌ మార్చి 27న నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు గురువారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు.