India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన రోడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 1 నాటికి గుర్తించిన 13,616 గుంతల్లో 10,962 పూడ్చేశారు. ఒక్కరోజులోనే 108 గుంతలు మరమ్మతయ్యాయి. ఇప్పటి వరకు 544 క్యాచ్పిట్స్ రిపేర్లు, 311 కవర్ రీప్లేస్మెంట్లు, 12 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తయ్యాయి. జోన్ల వారీగా వేగంగా మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణం పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై నేడు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో విచారణ జరగనుంది. సీబీఐకు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని KCR, హరీశ్‌రావు కోరుతున్నారు. నిన్న మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్ని న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వం నిర్ణయం ఇవ్వాళ ఏజీ కోర్టుకు తెలుపనుంది.
దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే.. నాటి HYD సంస్థానం (TG) నిరంకుశత్వంలో నలిగిపోయింది. రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా సామాన్యులే ఉద్యమాన్ని నడిపారు. దీనికి పరకాల ఘటనే సాక్ష్యం. సరిగ్గా 78 ఏళ్ల క్రితం 1947 SEP 2న అక్కడ జాతీయ పతాకావిష్కరణకు వేలాది మంది ర్యాలీగా బయలెల్లారు. రజాకార్లు విచక్షణారహితంగా వారిపై కాల్పులకు తెగబడగా 16 మంది అమరులయ్యారు. ఇది మరో జలియన్వాలాబాగ్ని తలపించింది.
గ్రేటర్లో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్-1 నుంచి సెప్టెంబర్-1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 617.8 MM వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అత్యధికంగా అమీర్‌పేట, ఖైరతాబాద్‌లలో 56%, శేరిలింగంపల్లిలో 54% నమోదైంది.
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.
సకాలంలో గణేశ్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేశుడి ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజీ పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులకు సహకరించాలని కోరారు.
మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక నారీ సూచీ HYDలో మహిళలకు సురక్షిత వాతావరణం నెలకొన్నట్లు తెలిపింది. అయితే.. ఎక్కువగా సూటిపోటి మాటలతో వేధింపులకు గురైనట్లు 65% మంది మహిళలు పేర్కొన్నారు. 23% మంది భౌతిక వేధింపులు, 5% మంది మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెళ్లడైంది. రవాణాలో 33%, ఆహ్లాదకరమైన ప్రదేశాల్లోనూ 12 మంది వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
HYD జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు (MSME) డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ (ఆన్లైన్) పై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటలకు HYD కలెక్టరేట్లో పరిశ్రమల శాఖాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, అలాగే బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా విక్రయ విధానంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.
Sorry, no posts matched your criteria.