Hyderabad

News April 19, 2026

బస్సుల రూపురేఖలు మార్చే యూనిట్ ఎక్కడుందో తెలుసా..?

image

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులకు జరిగే రిపేర్లు, బస్సుల రూపురేఖలు మార్చే యూనిట్ ఎక్కడుందో తెలుసా..? మియాపూర్‌లో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ అందుబాటులో ఉంది. ఇక్కడ బస్సును ఎలా కావాలంటే అలా మార్చేస్తారు. కాగా, ప్రస్తుతం దాదాపు 150 ఎక్స్‌ప్రెస్ బస్సులను ఫైర్ సేఫ్టీ సిస్టంతో సిద్ధం చేస్తున్నారు. ఇవి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సీటింగ్ అరేంజ్మెంట్ సహా అన్నీ పనులు ఇక్కడే జరుగుతాయి.

News April 19, 2026

HYD: MMTSలో ఫ్రీ జర్నీకి అసలు చిక్కు

image

MMTS ఫ్రీ ఫేర్ <<19690151>>ప్రతిపాదన<<>> బాగున్నా, అమలుకు అడ్డంకులు లేకపోలేదు. MMTS ఫేజ్-2కు ప్రభుత్వం ఇవ్వాల్సిన ₹491 కోట్ల బకాయిలు ఇస్తేనే సహకరిస్తామని SCR మెలిక పెట్టింది. స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేర్చడానికి RTC ఫీడర్ సర్వీసులు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తూర్పునకు మెట్రో విస్తరించడం, MMTS టైమ్‌కు రాదని ఉద్యోగులు దూరం అయ్యారు. మళ్లీ 1.2లక్షల రైడర్ షిప్‌ను చేరుకోవచ్చని Govt భావిస్తోంది.

News April 19, 2026

HYD: సంక్షోభంలో MMTS.. సేవ్ చేసేందుకా?

image

2008లో MMTS కూతపెట్టినప్పుడు నగరవాసులకదో గొప్ప అనుభవం. అయితే <<19689756>>ఇప్పుడు<<>> MMTSను కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఓ ‘ఎమర్జెన్సీ మెజర్’అని తెలుస్తోంది. కొవిడ్‌కు ముందు రోజుకు లక్షన్నర మంది ప్రయాణించిన MMTSలో, ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. ‘మహాలక్ష్మి’ పథకంతో రైల్వే ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయినట్లు ఈ గణాంకాలే చెబుతున్నాయి. అందరికీ ఫ్రీ అంటే జనం మళ్లీ రైలెక్కుతారని సర్కార్ నమ్ముతోంది.

News April 19, 2026

HYD: MOU దశలో MMTSలో ‘ఫ్రీ ఫేర్‌’ (1)

image

MMTSలో ‘జీరో ఫేర్’(ఫ్రీ జర్నీ) ఎందుకో Way2News ఎక్స్‌క్లూజివ్‌లో తెలుసుకుందాం. TG అవతరణ దినోత్సవం నుంచి ఏడాదిపాటు ప్రతిష్ఠాత్మకంగా నడపాలనే ప్రతిపాదనను CS రామకృష్ణరావు రైల్ నిలయంలో SCR GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ముందుంచారు. MMTS ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టంచేశారు. దీనిపై MOU ఇవ్వాలని రైల్వే శాఖ కోరింది. ప్రధానంగా HYDలో ట్రాఫిక్, కాలుష్యం తగ్గించడానికేనని సమాచారం.

News April 19, 2026

HYD: పాలిటెక్నిక్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఫ్రీ క్లాసెస్

image

పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యేవారికి కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించే పాఠ్యాంశాలు విద్య ఛానల్‌లో సా.5-7 గంటల వరకు, నిపుణ ఛానల్‌లో రా.9-11 గంటల వరకు కోచింగ్ అందుబాటులోకి రానున్నట్లు TSAT సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

News April 19, 2026

HYD: పాలిటెక్నిక్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఫ్రీ క్లాసెస్

image

పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యేవారికి కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించే పాఠ్యాంశాలు విద్య ఛానల్‌లో సా.5-7 గంటల వరకు, నిపుణ ఛానల్‌లో రా.9-11 గంటల వరకు కోచింగ్ అందుబాటులోకి రానున్నట్లు TSAT సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

News April 19, 2026

HYD: అజ్జూ భాయ్ కోసం.. CM రేవంత్!

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ కానున్నారు. పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా MLCలు ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని ఆయన కోరనున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు ఈ నెలాఖరుతో ఆరు నెలల గడువు ముగియనుంది. ఈలోపు ఆయన ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి. ఒకవేళ గవర్నర్ ఆమోదం లభించకపోతే అజాహరుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.

News April 19, 2026

HYD: మహిళలకు ఫ్రీ బ్యూటీషియన్ శిక్షణ

image

మొయినాబాద్‌లోని చిల్కూరులో SBI- RSETI ఆధ్వర్యంలో మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18- 45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 79819 51167 నంబరును సంప్రదించగలరు.

News April 19, 2026

ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బల్కంపేట్ ఎల్లమ్మ

image

నగరంలో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో అమ్మవారు నేడు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆదివారం పురస్కరించుకొని ప్రత్యేకంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని దర్శనానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనానికి అరగంట పడుతోందని, వారాతం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

News April 19, 2026

హైదరాబాద్‌లో 22 వరకు వర్షాలు

image

ఎండతాపానికి విలవిలలాడుతున్న నగర వాసులకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఈనెల 22 వరకు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 23- 24 నుంచి వర్షాలు క్రమంగా తగ్గి, మళ్లీ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసినప్పటికీ, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉష్ణోగ్రతలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చన్నారు. ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.