Hyderabad

News March 16, 2025

సికింద్రాబాద్: అగ్నివీర్ దరఖాస్తులు.. కీలక సూచన

image

భారత సైన్యంలో సేవలందించేందుకు అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10 ఆఖరు తేది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయానికి (040 27740059)కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. SHARE IT

News March 16, 2025

HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

image

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

News March 15, 2025

HYD: భారీగా పెరిగిన నీటి వినియోగం

image

హైదరాబాద్ మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో నీటి వినియోగం కూడా భారీగా పెరిగింది. అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 1,12,926 ట్యాంకర్ల నీటిని ఉపయోగించగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1,50,000 ట్యాంకర్లు బుక్ చేశారని జలమండలి ఫిబ్రవరి నెలకు సంబంధించి నివేదికలో పేర్కొంది.

News March 15, 2025

సమ్మర్ ఎఫెక్ట్… జూ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు

image

ఎండలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో జూ పార్క్ అధికారులు జంతువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంక్లోజర్ల వద్ద స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. పక్షులు ఇబ్బంది పడకుండా వాటి చుట్టూ గడ్డి ఏర్పాటు చేశారు. బాతుల రక్షణకు షేడ్ నెట్స్ ఉపయోగిస్తున్నారు.

News March 15, 2025

HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

image

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

News March 15, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

News March 14, 2025

HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

image

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.

News March 14, 2025

హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

image

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.

News March 14, 2025

దైరతుల్ మారిఫిల్ డైరెక్టర్‌గా ప్రొ. షుకూర్

image

ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా డైరెక్టర్‌గా ప్రొ. ఎస్ఏ షుకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలు, అరబిక్ గ్రంథాలను భద్రపరిచేందుకు నిజాంపాలనలో నెలకొల్పిన ఈ కేంద్రం ఓయూకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన షుకూర్ తిరిగి అదే పదవిలో నియమితులయ్యారు.

News March 14, 2025

HYDలో ప్రప్రథమ శారీ డ్రాపింగ్ ఈవెంట్.. @మాంగళ్య షాపింగ్ మాల్

image

భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.

error: Content is protected !!