Hyderabad

News April 8, 2026

బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై అత్యాచారం

image

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పైలట్ శిక్షణ సంస్థలో దారుణం జరిగింది. పైలట్ శిక్షణ పొందుతున్న యువతిపై ఇన్‌స్ట్రక్టర్ నసీముద్దీన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని లొంగదీసుకొని, అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

News April 8, 2026

స్టేట్ INCOME.. మన HYD నుంచే అధికం..!

image

రాష్ట్రానికి అధిక ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి నుంచే సమకూరుతోంది. 2025-26లో దాదాపు 80% రాబడి(రూ.78,706CR)తో HYD, RR, MDCL, సంగారెడ్డి(D) టాప్‌లో నిలిచాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు, కంపెనీలుండటం ఇందుకు ముఖ్యకారణం. ఇక నారాయణపేట, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్(D)లు 1-2%తో వెనుకంజలో ఉన్నాయి. ఈ జిల్లాలు వ్యవసాయంపైనే ఆధారపడటం, తయారీ యూనిట్లు అంతంతమాత్రంగానే ఉండటంతో ఇన్‌కంలో చెప్పుకోదగ్గ స్థానాల్లో లేవు.

News April 8, 2026

HYD రోడ్లపై రోజుకు ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో తెలుసా..?

image

సిటీలో రోడ్లపై రోజుకు సగటున ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో తెలిపారు సైబరాబాద్ పోలీసులు. హైటెక్ సిటీలో గంటసేపు పరిశీలిస్తే కేబుల్ బ్రిడ్జ్‌పై రోజుకు 1,20,000 వెహికిల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు. గంటకు 13,500 బండ్లు 4 సైడ్ల రోడ్లపై తిరుగుతున్నాయట. సింగిల్ ఆక్యుపెన్సీ వాహనాలు 6,554, డబుల్ ఆక్యుపెన్సీ 3,584గా ఉన్నాయని చెప్పారు. ఐదుగురు వెళ్లే కారులో ఒక్కరే వెళ్తుండటమూ ట్రాఫిక్‌‌కు కారణమమని పేర్కొన్నారు.

News April 8, 2026

HYD: కల్తీ మామిడిపండ్లను పసిగట్టండిలా..!

image

సహజంగా పండిన మామిడిపండు ఆకుపచ్చ, పసుపు రంగు మిశ్రమంలో కన్పిస్తుంది. ఇది సువాసన వెదజల్లడంతో పాటు పుల్లగా, తియ్యగా ఉంటుంది. నీళ్లలో వేస్తే మునిగిపోతోంది. రసాయనాలతో మగ్గించిన పండుకు ఎలాంటి వాసన ఉండదు. తింటే చప్పగా ఉంటుంది. ఇది పూర్తిగా పసుపుపచ్చ రంగులో కన్పిస్తుంది. నీటిలో వేస్తే ఇట్టే తేలిపోతుంది. కాగా వ్యాపారులు మోతాదుకు మించి రసాయనాలు వినియోగించినట్లు తేలితే రూ.7లక్షల జరిమానా, 3 ఏళ్ల జైలు ఉంటుంది.

News April 8, 2026

HYD: రూ.1200 కోట్ల భూమి కాపాడిన హైడ్రా

image

HYD గచ్చిబౌలి IT కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలోని ప్రభుత్వ జాగాను కాపాడింది. శేరిలింగంపల్లి ఖానామెట్‌లోని సర్వే నం.55లోని 8 ఎకరాలకుపైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. దీని విలువ రూ.1200కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

News April 8, 2026

చెన్నైకీ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం: CMDA

image

తెలంగాణలోని హైడ్రా పనితీరును అధ్యయనం చేసేందుకు చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించింది. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, వరద నియంత్రణలో హైడ్రా అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని ఈ బృందం కొనియాడింది. చెన్నై వంటి నగరాల్లోనూ ఇలాంటి సమన్వయ వ్యవస్థ ఏర్పాటు అవసరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.