Hyderabad

News April 9, 2026

నాగులపల్లిలో మెగా ఇంటర్చేంజ్ హబ్

image

నాగులపల్లి దగ్గర నిర్మిస్తున్న ‘మెగా ఇంటర్చేంజ్ హబ్’ ఈ ప్రాజెక్టుకే హైలైట్. అంతర్గత సమాచారం ప్రకారం.. ఇక్కడ మెట్రో, MMTS మాత్రమే కాకుండా, ప్రతిపాదిత బులెట్ ట్రైన్ కారిడార్ కూడా కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. 278 కిలోమీటర్ల మేర సాగే ఫేజ్-3 విస్తరణలో భాగంగా విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తున్నారు. ఈ స్టేషన్ల చుట్టూ 80% వాణిజ్య నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

News April 8, 2026

HYDలో కొత్తగా లీగల్ నోటీసులు రెడీ!

image

చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఇన్వెస్టిగేషన్ మరో స్థాయికి చేరింది. ఇప్పటివరకు భౌతిక కూల్చివేతలే చూశాం.. కానీ, ఇప్పుడు ‘ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కాంపెన్సేషన్’ కింద ఆక్రమణదారుల ఆస్తులను అటాచ్ చేసేలా ప్రభుత్వం లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మార్చిందని సమాచారం. సర్వే నంబర్ల వారీగా ఆక్రమణదారులను గుర్తించి, 150 మందికిపైగా బడా బిల్డర్లు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది.

News April 8, 2026

HYDలో చోరీ అయిన బైక్‌కు చలాన్.. ఓనర్ రిక్వెస్ట్ ఇదే!

image

3 నెలల క్రితం హబీబ్‌నగర్ PS పరిధిలో చోరీకి గురైన బైక్‌ ట్రాఫిక్ చలాన్‌లో కనిపించిందని ఒకరు ట్వీట్ చేయడం SMలో చర్చనీయాంశమైంది. బైక్ పోయిందని ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రహమాన్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఇటీవల ఆ వాహనంపై పడిన చలాన్ ఫొటోలో ఓ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. అయితే, ఆ చలాన్‌ మార్చి 27న నమోదైంది. తన బైక్‌ను వెతికిపెట్టాలని రహమాన్‌ పోలీసులను కోరాడు. పోలీసులు స్పందించాల్సి ఉంది.

News April 8, 2026

హైదరాబాద్: భూములకు రక్షణ కవచం!

image

HYD శివార్లలో భూ వివాదాలకు చరమగీతం పాడేలా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన ల్యాండ్ రికార్డ్స్ సిస్టమ్ సిద్ధమైంది. కబ్జాలను అడ్డుకోవడానికి డ్రోన్ సర్వే డేటాను రెవెన్యూ రికార్డులతో లింక్ చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ‘ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ’ని ఏర్పాటు చేసే ఫైల్ ప్రస్తుతం CM టేబుల్‌పై ఉందని సమాచారం. ఇది అమలైతే రిజిస్ట్రేషన్ అయ్యాక దాన్ని సవాలు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు.

News April 8, 2026

HYD: 2 BHK కాలనీల్లో వేలానికి షాపులు

image

క్యూర్ పరిధిలోని 36 2BHK కాలనీల్లోని 1,400 పైగా దుకాణాల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రంగారెడ్డి: APR 9, 10న 8 కాలనీల్లోని 273 షాపులు, హైదరాబాద్: APR 15, 16న 10 కాలనీల్లోని 77 షాపులు, మేడ్చల్: ఏప్రిల్ 15, 17న 12 కాలనీల్లోని 892 షాపులు, సంగారెడ్డి: ఏప్రిల్ 15 నుంచి 18, తిరిగి 21న 6 కాలనీల్లోని 372 షాపులకు వేలం వేస్తారు. ఆసక్తి గలవారు నిర్ణీత EMDతో RDO కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకోవాలి.

News April 8, 2026

FLASH: గచ్చిబౌలిలో ONE YEAR ఆంక్షలు

image

గచ్చిబౌలి IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు నేటి నుంచి సుమారు ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు, ఐటీ ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
SHARE IT

News April 8, 2026

HYD: అడ్డంగా దొరికిపోయిన CI, SI

image

శంషాబాద్ RGIA పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఇన్‌స్పెక్టర్ కనకయ్య, SI సిద్ధేశ్వర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ₹5 లక్షలు డిమాండ్ చేశారు. ₹2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఇన్‌స్పెక్టర్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏకంగా ₹33.97 లక్షల నగదు, పత్రాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2026

HYD: పోలీసుల చేతికి హైటెక్ కెమెరాలు!

image

HYDలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌కు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. నగరవ్యాప్తంగా నిఘాను పటిష్ఠం చేస్తూ 300 అధునాతన డిజిటల్ కెమెరాల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 12 మెగాపిక్సెల్ సామర్థ్యం, నైట్ మోడ్, GPS ట్యాగింగ్ వంటి అత్యాధునిక హంగులతో కూడిన ఈ కెమెరాల కోసం ప్రభుత్వం వేట మొదలుపెట్టింది. పారదర్శకత పెంచేందుకు, సాక్ష్యాధారాల సేకరణను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.