Hyderabad

News April 1, 2026

FLASH: ‘GHMC’ ఖజానా ఫుల్ ‘ఖుష్’

image

​నగరవాసులు పన్నుల చెల్లింపులో జోరు పెంచారు! గత ఆర్థిక సంవత్సరంలో GHMC పరిధిలో రూ.2,038 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, ఈసారి ఆ నంబర్ అమాంతం పెరిగింది. ఈ ఏడాది GHMCతో పాటు MMC, CMC కార్పొరేషన్లు కలిపి ఏకంగా రూ.2,556 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించాయి. ముందస్తు పన్ను చెల్లింపు రాయితీలు, కఠిన నిబంధనలే ఈ భారీ వసూళ్లకు కారణమని కమిషనర్ చెబుతున్నారు. అభివృద్ధి కోసం జనం స్వచ్ఛందంగా కదులుతుండటం విశేషం!

News April 1, 2026

HYD: ‘సమ్మర్ హాలిడేస్’ వచ్చేశాయ్!

image

TG ప్రభుత్వం 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు సెక్రటేరియట్ తెలిపింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సెలవుల్లో పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలని సూచించారు.

News April 1, 2026

HYD: నెక్లెస్‌ రోడ్‌కు కొత్త కళ

image

నగరంలోని PVNR మార్గ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు HMDA రూ.1.13 కోట్లతో పనులు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల కోసం అత్యాధునిక ఆట పరికరాలు, ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సందర్శకులు సేద తీరేందుకు అందమైన బెంచీలు, పెర్గోలాలు అందుబాటులోకి వస్తాయి. నగరవాసుల ఆరోగ్యం, ఉల్లాసమే లక్ష్యంగా ఈ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

ఫ్యూచర్ సిటీలో రియల్ మాఫీయా ‘స్కెచ్’

image

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ అధికారికంగా బయటకు రాకముందే ఏ సర్వే నంబర్లలో ‘హై-వాల్యూ’ జోన్లు వస్తాయో కొంతమందికి లీక్ అయిపోయింది. దీంతో కారుచౌకగా రైతుల నుంచి భూములు కొట్టేసిన రియల్ మాఫియా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ‘ల్యాండ్ పూలింగ్’ పేరుతో భారీ లాభాలు గడిస్తోంది. FCDA పరిధిలో జరుగుతున్న ఈ ‘ఇన్సైడర్ ట్రేడింగ్’పై విజిలెన్స్ నిఘా పెట్టినా, రాజకీయ ఒత్తిళ్లతో రిపోర్టులు బయటకు రావడం లేదని టాక్.

News April 1, 2026

దద్దరిల్లనున్న హైదరాబాద్‌.. రేపు వరల్డ్ బిగ్గెస్ట్ ర్యాలీ

image

రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ మహా ప్రదర్శన తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగుతుంది. వేలాదిగా తరలిరానున్న భక్తులతో నగరం కాషాయమయం కానుంది. భజరంగబలి నామస్మరణతో భాగ్యనగరం దద్దరిల్లేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 12KM పొడవునా ‘జై శ్రీరామ్’.. ‘జై హనుమాన్’ నినాదాలతో ర్యాలీ కొనసాగనుంది.

HYD: ​ప్రాణదాత ‘ట్యాంక్‌బండ్ శివ’కు CM చేయూత

image

హుస్సేన్ సాగర్‌లో వందలాది ప్రాణాలను కాపాడిన ట్యాంక్‌ బండ్ శివను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి భారీ సాయం ప్రకటించారు. శివ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, ఆయన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. అదనంగా శివకు డబుల్ బెడ్రూం ఇల్లు, ఉపాధి కోసం ట్యాంక్‌ బండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

News April 1, 2026

HYD: సరిగ్గా ‘పనిచేయని వాట్సాప్’.. మరి మీకు..?

image

GHMC, MMC, CMC పరిధిలో రోడ్లపై గార్బేజీ, నిర్మాణ వ్యర్థాలు కనిపిస్తే ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రత్యేక వాట్సాప్ సర్వీస్ తీసుకొచ్చారు. తీరా అది మాటలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ప్రతీసారి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, ఫిర్యాదు చేసిన తర్వాత, స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ లేదని నగర ప్రజలు చెబుతున్నారు. మీకూ ఇలాగే జరుగుతోందా..? వాట్సాప్ నంబర్ 8125966586.