Hyderabad

News September 26, 2024

HYD: ఇళ్లకు ‘RB-X’ మార్కింగ్..!

image

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.

News September 26, 2024

BREAKING: HYD: 25 బృందాలతో మూసీలో సర్వే

image

గ్రేటర్ HYD పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలోని మూసీపై 16 బృందాలు, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలతో కలిపి మొత్తం 25 టీమ్స్‌తో సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సర్వే బృందాల సభ్యులు సేకరిస్తున్నారు. బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నట్లు వారు తెలిపారు.

News September 26, 2024

హైదరాబాద్‌ వెరీ కూల్ (PHOTO)

image

గ్రేటర్‌ HYDలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం పేర్కొంది. తెల్లవారుజామున నగరంలో వర్షం కురిసింది. ప్రస్తుతం చల్లటి గాలులు వీస్తున్నాయి. KBR పార్క్, నెక్లెస్ రోడ్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం దర్శనమిస్తోంది. కూల్ వెదర్‌ను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.

News September 25, 2024

BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు

image

మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.

News September 25, 2024

28న ఎంజే మార్కెట్‌లో గజల్, షాయరీ

image

సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగా ఉన్నవారు బుక్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.

News September 25, 2024

‘HYDలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’

image

హైదరాబాద్‌లో సుప్రీం కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని, దానికోసం సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం కర్నూల్‌లో హై కోర్డు బెంచ్, అమరావతిలో లా యూనివర్సీటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

News September 25, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

హైదరాబాద్‌కు బుధవారం వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నగరంలో నిన్నటి మాదిరిగానే మళ్లీ మధ్యాహ్నం, రాత్రి సమయంలో (వరుసగా 6వ రోజు) ఉరుములతో కూడిన వర్షం పడనుంది అని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో HYDలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన GHMC సహాయక చర్యలు చేపడుతోంది.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.