India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని VCK రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన అధ్యక్షతన బుధవారం బాగ్‌లింగంపల్లిలోని SVKలో ‘దక్షిణాది పార్లమెంటు సీట్లు పెంపు-దక్షిణాది హక్కు’ పై వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని, HYDను దేశానికి 2వ రాజధానిగా చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మీ కామెంట్?
తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం ఈరోజు జరిగింది. అసెంబ్లీకి వచ్చిన BRS అధినేత KCRను పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికార్డును KCRకు ఇచ్చి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం ఆయన BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన KCRను కలవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్‌లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.
తెలంగాణ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బషీర్‌బాగ్, నాంపల్లి, రవీంద్రభారతి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.
OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.
గ్రేటర్ HYDలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. నేటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి మొదటివారంలోనే ఇంతటి ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగు పట్టడం తప్పనిసరి అవుతోంది అని వారు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతుందని కేటీఆర్ మండిపడ్డారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడని అన్నారు. ‘చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతుండు. ఏం చేయాలో దిక్కుతోచక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు’ అని అన్నదాతల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యునివర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వర్సిటీకి రూ.300 కోట్లు కేటాయించింది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోఠి ఉమెన్స్ కాలేజ్‌ను యూనివర్సిటీగా మార్చడంతోపాటు దానికి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యునివర్సిటీగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై గత 2 రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిల్లర వేషాలను కాంగ్రెస్ నేతలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.. ఏ వర్గాల భవిష్యత్తు కోసం పని చేయాలో క్లారిటీ ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.