India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD పాతబస్తీ ఏరియా రహదారుల్లో వాహనాలు నడపడమే కష్టంగా మారింది. ఇరుకైన గల్లీల్లో మరో సమస్య తోడైంది. వ్యర్థాలు మోతీ దర్వాజా, బకి చరోస్తా, బాతేనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. చెత్తను కుక్కలు, పశువులు పీక్కుతింటున్నాయి. పాతబస్తీ ఏరియాలో శానిటేషన్ సరిగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షాలు పడితే మరింత అధ్వానంగా మారుతోందని అంటున్నారు.
గ్రేటర్ HYD కోసం GHMC ఎలా పనిచేస్తుందో తెలుసా..? జీహెచ్ఎంసీకి ప్రజాప్రతినిధులైన మేయర్, డిప్యూటీ మేయర్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకునే కమిషనర్, ఇంజినీరింగ్, శానిటేషన్, హెల్త్ వంటి డిపార్ట్‌మెంట్లు చూసుకునేందుకు అడిషనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లు, ఒక్కో జోన్లో ఒక్కో జోనల్ కమిషనర్, 30 సర్కిల్స్, ఒక్కో సర్కిల్ చూసుకునేందుకు డిప్యూటీ కమిషనర్, మరోవైపు జాయింట్ కమిషనర్లతో నడుస్తోంది.
HYDతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కంపోస్ట్ ఎరువు తయారీపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 81 రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 39,161మంది తమ ఇళ్ల వద్దే కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారని మున్సిపల్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్‌సైట్ లింకులు పంపించి సైబర్ మోసాలకు పాల్పడి వేల రూపాయలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింకులు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు. ఏవైనా మెసేజెస్, లింకులపై బ్యాంకులను సంప్రదించాలన్నారు.
HYD మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కోర్సుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ లర్నింగ్ అండర్ UG, PG, డిప్లమా సర్టిఫికెట్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
HMDA త్వరలోనే తుర్కయంజాల, బాచుపల్లి ప్రాంతాల్లో 82 ప్లాట్లను విక్రయించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆ తర్వాత మిగతా స్థలాలు అమ్మనున్నారు. బాచుపల్లి పరిధిలో 70ప్లాట్లు, తుర్కయంజాల పరిధిలో 12 ప్లాట్లు ఉన్నాయి. దశలవారీగా బైరామల్‌గూడ, కోకాపేట, చందానగర్, బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, పూప్పాలగూడ ప్రాంతాల్లోని ప్లాట్లను సైతం HMDA విక్రయించనుంది.
GHMC వ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటటమే టార్గెట్ అని అధికారులు తెలిపారు. ఇందులో HYD పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో మొక్కల పంపిణీ చేశారు. 1,500 పార్కులలో మొక్కలు నాటడం, వంతెనలు, కమ్యూనిటీ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం తెలియజేసింది.
GHMC వ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటటమే టార్గెట్ అని అధికారులు తెలిపారు. ఇందులో HYD పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో మొక్కల పంపిణీ చేశారు. 1,500 పార్కులలో మొక్కలు నాటడం, వంతెనలు, కమ్యూనిటీ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం తెలియజేసింది.
HYDలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. 2025 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటికీ 9,899 గుంతలు పూడ్చి వేసినట్లుగా తెలియజేశారు. ప్రతి వార్డులో ఏరియాల ప్రకారంగా ప్రత్యేక బృందాలు రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేపడుతున్నట్లుగా అధికారులు వివరించారు.
HYDలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే తెలియని వారు ఉండరు. భారీ బిల్డింగ్‌లు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ అందాలకు ఈ ఏరియాలు మారుపేరు. ధనికులు ఉండే ప్రాంతంగానూ పేరు పొందింది. కానీ.. ఇప్పుడు బంజరాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రహదారులు గుంతల మయంగా మారి, అధ్వాన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12 పరిస్థితికి అద్దంపట్టే రోడ్డు ఫొటో.
Sorry, no posts matched your criteria.