Hyderabad

News March 28, 2025

ఖైరతాబాద్ : ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ

image

జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి ఈ నెల 31 వరకు దాదాపు విశ్రాంతి ఉండేలాగా కనిపించడంలేదు. ఆయా సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్తి పన్ను వడ్డీపై ఇచ్చే 90% రాయితీని ఉపయోగించుకోవాలని గ్రేటర్ కమిషనర్ ఇలంబర్తి నగర ప్రజలకు సూచించారు.

News March 28, 2025

HYD: శాసనమండలి సభ్యులను సన్మానించిన సీఎం

image

శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.

News March 28, 2025

మెట్రో ఎండీ పదవి కాలం కొనగించే అవకాశం..!

image

నిన్న ప్రభుత్వం టెర్మినేట్ చేసిన వారిలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఉన్నారు. 2016లో రిటైర్డ్ అయిన మెట్రో ఎండీ, ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరొకసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది.

News March 28, 2025

HYD: అసైన్మెంట్ గడువు పొడిగింపు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం జి.రామ్ రెడ్డి దూర విద్యలో UG, PG విద్యార్థులకు అసైన్మెంట్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అధికారిక ప్రకటన విడుదల చేసిన అధికారులు, ఇది తుదిగడువు అని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి సమర్పించని విద్యార్థుల అసైన్మెంట్లు తిరస్కరిస్తామని హెచ్చరించారు. గడువు దాటిన తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

News March 28, 2025

HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

image

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్‌లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.

News March 28, 2025

HYD: కూతురిని హత్య చేసిన తల్లి

image

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News March 28, 2025

హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 28, 2025

కళకళలాడుతోన్న చార్మినార్

image

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్‌ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో‌ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్‌ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్‌ బజార్, రాత్‌ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్‌కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.

News March 27, 2025

ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

image

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

News March 27, 2025

కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు ఢిల్లీలో శిక్షణ

image

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో “నేతృత్వ సృజన్” పేరుతో మహిళా నాయకత్వ శిక్షణ తరగతులు న్యూఢిల్లీలో 2 రోజులపాటు జరిగాయి. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.

error: Content is protected !!