Hyderabad

News September 20, 2024

28న రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’

image

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘కళా మహోత్సవ్’ మొదటి ఎడిషన్ను ఈనెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సందర్శకులు https://visit.rashtrapatibhavan. gov.in వెబ్సైట్లో స్లాట్ను రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

News September 20, 2024

సికింద్రాబాద్: వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 20, 2024

HCU నుంచి 29 మంది అత్యుత్తమ ప్రొఫెసర్లు

image

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అధ్యాపకుల జాబితాలో 29 మంది HCU ప్రొఫెసర్లు చోటు దక్కించుకున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఐయోనిడిస్ ఇటీవల గ్లోబల్ బెస్ట్ ప్రొఫెసర్ల వివరాలను వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయి అధ్యాపకులలో HCU నుంచి 29 ప్రొఫెసర్లు ఉండటం విశేషం. దీనిపై వర్సిటీ వీసీ హర్షం వ్యక్తం చేశారు.

News September 20, 2024

HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి కాదు అబ్బాయి!

image

న్యూడ్ కాల్స్ పేరిట యువకులను మోసం చేస్తున్న వ్యక్తిని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ వెబ్‌సైట్స్ ద్వారా వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న బెంగుళూరు వాసి రిషద్ బేడీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి లాగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, పలువురు యువకులను ఆకట్టుకున్నాడు. బాధితుల న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

News September 19, 2024

HYD: సేవాసంస్థలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునివృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు విశేష సేవలు అందించిన సంస్థలు ఈనెల 25లోపు హైదరాబాద్ నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ భవనంలో దరఖాస్తులు అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫార్మ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. www.wdsc.telangana.gov.in

News September 19, 2024

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.

News September 19, 2024

BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా

image

కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.

News September 19, 2024

HYD: పాత నేరస్థులతో ముఠా ఏర్పాటు.. వేషాలు మార్చి చోరీలు

image

<<14135182>>మారు వేషాలతో<<>> చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. నిందితుడు సుధాకర్(33) నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఓ కేసులో జైలుకెళ్లి అక్కడ పాత నేరస్థుడు బండారిని కలిసి మరికొంత మందితో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వారు మహిళల్లా వేషాలు మార్చి చోరీలకు పాల్పడి సొత్తును సోదరుడు సురేశ్‌కు ఇచ్చి నగదు రూపంలోకి మర్చుకునేవారని తెలిపారు.

News September 19, 2024

HYD: నవోదయ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గచ్చిబౌలి నవోదయ విద్యాలయం ప్రధానాచార్యుడు డి.విజయ్ భాస్కర్ శుభవార్త చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష గడువును పొడిగించినట్లు వెల్లడించారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News September 19, 2024

HYD: నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తు పొడిగింపు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గచ్చిబౌలి నవోదయ విద్యాలయం ప్రధానాచార్యుడు డి.విజయ్ భాస్కర్ శుభవార్త చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష గడువును పొడిగించినట్లు వెల్లడించారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.