India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫ్లడ్ కమిటీల ఏర్పాటుపై నేడు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఆ శాఖ వర్గాలు మీడియాకు మంగళవారం వెల్లడించాయి. పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, రాకపోకల పునరుద్దరణ ప్రణాళికపై చర్చలు జరగనున్నాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు హజరు కానున్నట్టు తెలిపాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సేకరించి నివేదికలు సమర్పించాలి. ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.
రాష్ట్రంలో వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నెల రోజులుగా సీజనల్ వ్యాధులతో లక్షల మంది ప్రజలు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో బుధవారం (నేడు) ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ వెంకన్నగౌడ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో షరతులతో కూడిన పదోన్నతులపై ప్రభుత్వం న్యాయ విచారణ, బీసీ, ఓసీ ఉద్యోగులు నష్టపోయిన పదోన్నతులు కల్పించడం తదితర డిమాండ్లపై ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ మత్స్యకారుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ సేవలను ఆ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మత్స్య భవన్‌లో మత్స్య శాఖ కమిషనర్ డా.ప్రియాంక అలా, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ హెల్ప్ లైన్ నెంబర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సహాయార్థం 8090199299 హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 2 నుంచి 5 రెట్ల వరకు పెంచేసింది. భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 28న స్పీడ్-19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి RRR దక్షిణ భాగంపై చర్చించి, ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న మహానగరం ప్రజా రవాణాలో వెనకబడిపోతోంది. బస్సుల కొరతతో వందలాది మార్గాలను ఆర్టీసీ వదిలేసింది. ప్రస్తుతం నగరంలో 2,850 సిటీ బస్సులు 795 మార్గాలలో 25వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం 1,000 బస్సులు తక్కువగా నడుస్తున్నందున ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.