India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వేసవిలోనూ మలేరియా వంటి విషజ్వరాలు వస్తున్నాయి. నాగోల్, మూసారాంబాగ్, గౌలిగూడ, లంగర్‌హౌజ్ ప్రాంతాలతో పాటు, మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో గత 35 రోజుల్లో 12 కేసులు నమోదయ్యాయి. మురుగు నీటి నిల్వలు, దోమల వృద్ధి కారణంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతోందని, అందరూ జాగ్రత్త పడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోకి దోమలు రాకుండా మెష్, సహజ పద్ధతుల్లో పొగ వేసుకోవడం మేలని సూచించారు.

పెట్రోల్, డీజీల్ దొరుకుతుంది కానీ LPG గ్యాస్ దొరకట్లేదని మండిపడుతూ ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం రాత్రి రాజేంద్రనగర్ శివరాంపల్లి పిల్లర్ 291 వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో కింద గుమిగూడిన ఆటో డ్రైవర్లు సైతం వారికి మద్దతు పలికారు. రోజుకు కేవలం ఐదు లీటర్ల గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని, దాంతో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఆటోవాలాలు వాపోతున్నారు. ప్రభుత్వం తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

నార్సింగిలోని స్టార్ విల్లాస్‌లో భోజనం విషయంలో జరిగిన చిన్న గొడవ డ్రైవర్ ప్రాణం తీసింది. ఒకే ఇంట్లో పనిచేసే డ్రైవర్ కార్తీక్, వంటవాడు భాష మధ్య మద్యం మత్తులో మాటామాటా పెరిగింది. ఆకలిగా ఉందని కార్తీక్ అడగగా, ఆగ్రహించిన వంటవాడు భాష కత్తితో దాడి చేయడంతో కార్తీక్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

HYD ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 239 మంది వాహనదారులు పట్టుబడ్డారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘జీరో టాలరెన్స్’ విధానంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదాలను నివారించడంలో సహకరించాలని నగరవాసులను కోరుతున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని, గొడుగులు లేదా రెయిన్ కోట్లు ఉంచుకోవాలని హెచ్చరించింది.

అత్తాపూర్ PS పరిధిలోని హసన్‌నగర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన యువతిపై(28) 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు బధిర(మూగ) మహిళ కావడంతో సంకేతాల ద్వారా కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. తక్షణమే కుటుంబ సభ్యులు అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేశారు.

2023కు ముందు తయారైన బైక్, కార్ APRIL-1 నుంచి డేంజర్‌లో పడ్డట్టే. వచ్చే నెల నుంచి HYDలో E-20 పెట్రోల్ ఉండే ఛాన్స్ ఉంది. ప్లాస్టిక్, రబ్బర్‌ను ఇథనాల్ కరగదీస్తుంది. దీన్ని తట్టుకునేలా పైపులు మార్చాలి. దీనికి దుమ్ము, తేమను ఆకర్షించే గుణం ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్ మారుస్తుండాలి. ట్యాంక్‌లో సగానికిపైగా పెట్రోల్ ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.# SHAREIT

Sorry, no posts matched your criteria.