Hyderabad

News March 30, 2026

HYD: మరో కొత్త వ్యవస్థకు నిర్ణయం

image

ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని CM రేవంత్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్ఠమైన చర్యలు చేపడుతామని చెప్పారు. కాగా, ఇప్పటికే సిటీలో ఏర్పాటైన H-FAST కల్తీపై ఉక్కుపాదం మోపుతోంది.

News March 30, 2026

HYD: తవ్వకాలపై డ్రోన్ సర్వే.. రూ.150 కోట్ల నష్టం!

image

రాజేంద్రనగర్, మానసహిల్స్, జవహర్‌నగర్‌లో డ్రోన్ సర్వే చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. క్వారీలోని ఖనిజాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు LiDAR డ్రోన్ సర్వే చెబుతోంది. GOVTకి రావాల్సిన సీనియరేజ్ ఫీజు, పర్యావరణ TAX కలిపి రూ.150 కోట్ల వరకు లాస్ అయ్యింది. అదనంగా 40-50 అడుగుల లోతుకు వెళ్లినట్లు తేలింది. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 30, 2026

HYD మెట్రో రైల్ (Phase-1): ₹1,232 కోట్ల అదనపు భారం: CAG

image

HYD మెట్రో ఫేజ్-1 పనుల జాప్యం వల్ల ఏకంగా ₹1,232 కోట్ల అదనపు భారం పడిందని CAG నివేదిక కడిగిపారేసింది. భూసేకరణ, అలైన్‌మెంట్ మార్పులతో ప్రాజెక్టును సాగదీయడమే ఈ నష్టానికి కారణమని తేల్చింది. మార్చి 2026 నాటికి కీలక మలుపు తిరిగింది. L&T చేతుల్లో ఉన్న మెట్రోను ఇక ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇక నుంచి కేంద్రం దోస్తీతో ఫేజ్-2 పనులను పరుగులు పెట్టించాలని సర్కారు ప్లాన్.

News March 30, 2026

HYD: ఆంకోవీ చేపల నూనెతో BPకి చెక్

image

OU ప్రొఫెసర్ సందీప్త సూక్ష్మజీవ శాస్త్రంలో కీలక పరిశోధనలు చేశారు. చేప నూనెలో రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ ధ్రువీకరణ లభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆంకోవీ చేపల్లోని అమైనో ఆమ్లాలను వినియోగించడం ద్వారా రక్తపోటును నియంత్రించోచ్చని రుజువు చేశామని స్పష్టం చేశారు.
#SHARE IT

News March 30, 2026

HYD: బల్దియా సార్ల లీలలు.. చూస్తే కళ్లు బైర్లు!

image

బల్దియా సార్ల లీలలు మామూలుగా లేవు! జనాల ట్యాక్స్‌ డబ్బులు కాంట్రాక్టర్లకు ఎలా ఇచ్చారో కాగ్ రిపోర్టు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పని పూర్తికాకముందే ఒకే కాంట్రాక్టర్‌కు ఏకంగా ₹302 కోట్ల బిల్లులు గుమ్మరించారు. నిబంధనలను తుంగలో తొక్కి, MB రికార్డుల్లో మాయా చేశారు. పనులు చేయకున్నా జెట్ స్పీడ్‌లో బిల్లుల చెల్లించారు. అధికారుల కృపతో ప్రభుత్వ ఖజానాకు భారీ కన్నం పడింది. ఇది సిటీలో హాట్ టాపిక్ అయింది.

News March 30, 2026

HYD: ఆంకోవీ చేపల నూనెతో BPకి చెక్

image

OU ప్రొఫెసర్ సందీప్త సూక్ష్మజీవ శాస్త్రంలో కీలక పరిశోధనలు చేశారు. చేప నూనెలో రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ ధ్రువీకరణ లభించినట్లు తెలపారు. ముఖ్యంగా ఆంకోవీ చేపల్లోని అమైనో ఆమ్లాలను వినియోగించడం ద్వారా రక్తపోటును నియంత్రించోచ్చని రుజువు చేశామని స్పష్టం చేశారు.

News March 30, 2026

HYD: ధరలు పెరిగినా.. ఇక్కడ ప్లేట్ ఇరవై రూపాయలే!

image

నగరంలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కొరత ఉందని హోటళ్లలో ప్లేట్ టిఫిన్ రూ.50కి పెంచారు. సామాన్యుడు టిఫిన్ చేయాలంటేనే జంకుతున్న తరుణంలో, ఫుట్ పాత్‌లపై పెట్టే మొబైల్ టిఫిన్ సెంటర్‌లు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. కేవలం రూ.20లకే రుచికరమైన టిఫిన్ అందిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరకే టిఫిన్ లభిస్తుండటంతో వాహనదారులు, కూలీలు టిఫిన్ చేసి.. ‘ధర తక్కువైనా కడుపునిండింది’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2026

HYD: బియ్యం ఇస్తారు సరే.. ఎక్కడ స్టోర్ చేయాలి?

image

ఎండలు, వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చేనెలలో 3నెలలకు సరిపడా లబ్ధిదారులకు సర్కారు బియ్యం పంపిణి చేయనుంది. అయితే ఇపుడు రేషన్ డీలర్లు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేషన్ షాపులు నగరంలో ఇప్పుు చిన్న చిన్న మడిగెల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు క్వింటాళ్ల కొద్దీ బియ్యం స్టోర్ చేసుకోవాల్సి ఉండటంతో వాటిని ఎక్కడ నిల్వ ఉంచాలనేది తలనొప్పిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.

News March 30, 2026

HYDలో నేటి వాతావరణం ఇలా!

image

నగరంలో ఈరోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా ఉష్ణోగ్రత 38℃, కనిష్ఠంగా 25℃ వరకు ఉండనుందని పేర్కొంది.

News March 30, 2026

HYD: మోజుతీరాక మొహం చాటేశాడు

image

పరిచయం అయ్యాడు.. ప్రేమిస్తున్నానని నమ్మించాడు.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు.. తీరా లగ్గానికి నో చెప్పాడు. ఈ ఘటన శివారు మేడిపల్లి PS పరిధిలో జరిగింది. కాచవానిసింగారంలో నివసించే యువతి(29)కి సిద్దిపేట(D)కు చెందిన రాజా రవీంద్ర ఫ్రెండ్ యాప్‌లో పరిచయం అయ్యాడు. అతడిని నమ్మి పలుమార్లు ఏకాంతంగా కలిసింది. పెళ్లికి నిరాకరించడంతో మోసపోయాయని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.