Hyderabad

News August 21, 2025

HYDలో అదీ ఇదీ ఒకేలా ఉన్నా.. వేర్వేరు..!

image

HYDలోని ఈ ప్రాంతాల పేర్లతో ఎప్పుడూ కన్ఫ్యూజన్‌లో పడుతుంటాం. అవి దిల్‌సుక్‌నగర్-దిల్‌ఖుష్‌నగర్, హయత్‌నగర్-హిమాయత్‌నగర్, తుర్కయంజాల్- దేవరయంజాల్, ప్రతాపసింగారం-బాటసింగారం-నస్దిక్‌సింగారం, కీసర-ఘట్‌కేసర్, గడ్డిఅన్నారం-తట్టిఅన్నారం, అంబర్‌పేట్- పెద్దఅంబర్‌పేట్, లింగంపల్లి-బాగ్‌లింగంపల్లి, హైదర్‌నగర్-హైదర్‌గూడ, ఆకులమైలారం- దండుమైలారం, IBP పోచారం-ఘట్కేసర్ పోచారంతోపాటు 3 బండ్లగూడలతోపాటు ఇంకేమైనా ఉన్నాయా?

News August 21, 2025

HYD: ORRపైనే కూలీలకు ‘బతుకు’గండం

image

HYD ఔటర్ రింగ్ రోడ్డు కూలీలకు ప్రాణగండంగా మారుతోంది. ప్రయాణికుల కోసం మొక్కలను అందంగా ఎదిగేలా చూసే కూలీలకు భద్రత లేకుండా పోతోంది. చెట్లకు నీళ్లు పోసేటప్పుడు, కత్తిరించే సమయాల్లో అకస్మాత్తుగా వాహనాలు వచ్చి ఢీకొనడంతో ప్రాణాలు పోతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో ORRపై మృతి చెందుతున్నారు. వర్క్ ప్రోగ్రెస్ బోర్డులు పెట్టినప్పటికీ బొంగులూరు, కీసరలో ఆకస్మాత్తు ప్రమాదాలు ఇటీవల పలువురి ప్రాణాలు తీశాయి.

News August 21, 2025

హజ్‌ యాత్రకు HYD నుంచి 2,210 మంది ఎంపిక

image

హజ్‌ యాత్రకు నగరం నుంచి 2,210 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ సయ్యద్‌ ఆఫ్జల్‌ బియబానీ ఖుస్రో పాషా తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం 4,292 మందిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. 11,757 మంది అప్లై చేసుకోగా వీరిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. మరింత సమాచారం కోసం హజ్‌ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.

News August 21, 2025

పంజాగుట్ట నిమ్స్‌లో ప్రపంచ సుందరి

image

ప్రతష్ఠాత్మక నిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను ప్రపంచ సుందరి ఓపల్ సుచాత పరామర్శించారు. ఇందులో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సదుపాయాలను డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు. అనంతరం ఆమె ఆంకాలజీ బ్లాక్‌లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ వైద్యుడు డా.సదాశివుడు, మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.

News August 21, 2025

HYDలో సక్సెస్.. ఇక రాష్ట్రమంతటా!

image

మంత్రి సీతక్క బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలో చిన్నారులకు త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే HYDలో 139 అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయగా హాజరు 30% పెరిగిందని వెల్లడించారు. అంగన్వాడీ నూతన భవనాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించారు. టిఫిన్‌తో పాటు 100ML పాలు, వారంలో ఓ రోజు ఎగ్ బిర్యానీ, మరో రోజు వెజిటబుల్ కిచిడీ అందిస్తారు.

News August 21, 2025

దూసుకుపోతున్న KPHB ‘రియల్’ బిజినెస్

image

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ KPHB కాలనీలో ఎకరం ఏకంగా రూ.70 కోట్లు పలికింది. ఐటీ కారిడార్‌కు పక్కనే ఉండడం, కమర్షియల్‌ నిర్మాణాలు శరవేగంగా పెరగుతుండటంతో ఇక్కడి రియల్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణుల అంచనా. గతంలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్రతి వేలంపాటలో కూడా ఎక్కడా లేని విధంగా ధర పలుకుతూ వచ్చింది. ఇప్పుడు నగరంలో KPHB హాట్ కేక్‌గా మారింది.

News August 21, 2025

నేడు హైకోర్టులో KCR, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ KCR, హరీశ్‌రావు 2 వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలనే వీరి పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్ట్ జడ్జి జస్టిస్ కుమార్ సింగ్ విచారించనున్నారు. దీనిపై BRSకు రిలీఫ్ వస్తుందా? లేక ఏం జరగబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

News August 21, 2025

HYD: పెళ్లికాని ప్రసాదులు? జర జాగ్రత్త!

image

సింగల్‌గా ఉన్నారా? జర జాగ్రత్త! పెళ్లికాని ప్రసాదులు ఆకర్షణ బుట్టలో ఇట్టే పడిపోతున్నారు. డేటింగ్ యాప్స్, వాట్సప్, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో పరిచయం అవుతున్న యువతులు రాత్రి న్యూడ్ కాల్ చేస్తామని చెప్పి రూ.500 నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. సింగిల్స్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకుని 10 MIN కాల్స్‌తో రూ.వేలల్లో లాగేస్తున్నారు. హోటల్ గదులు బుక్ చేస్తామని చెప్పి, డబ్బులు తీసుకున్నాక హ్యాండ్ ఇస్తున్నారు.

News August 21, 2025

HYD: 101 మందికి సీవీ ఆనంద్ స్పెషల్ కౌన్సెలింగ్

image

నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని HYD సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన సీపీ ఆయా గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 101 మందిని విడిగా విచారించారు.

News August 21, 2025

HYD: వ్యాపారంగా వ్యభిచారం..అడ్డుకోలేమా?

image

అంతర్జాతీయ పేరు గడించిన HYDలో వ్యభిచారం వ్యాపారంగా మారింది. వివిధ దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి కొందరు వ్యభిచార ఊబిలోకి లాగుతున్నారు. ఇటీవల బండ్లగూడ, KPHB, మియాపూర్ ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. అందం, వయసు ఆధారంగా ధర నిర్ణయించి వల వేస్తున్నారు. పదేపదే ఈ ఘటనలు జరుగుతున్నా.. పూర్తిస్థాయిలో అదుపు కావడం లేదు. HYDలో వ్యభిచారాన్ని అడ్డుకోలేమా..? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.