India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో నేటి నుంచి 4 రోజులపాటు ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD పేర్కొంది. అంతేకాక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రాబోయే 3 రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కాగా, నిన్న భారీ ఉరుములతో వర్షం కురిసింది.

జూ పార్కులో సింహాలు, పులులను దగ్గరగా చూడాలనుకునే పర్యాటకులకు శుభవార్త. సఫారీ రైడ్ల కోసం కొత్త ఏసీ, నాన్-ఏసీ బస్సులను అద్దెకు తీసుకునేందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అత్యాధునిక సౌకర్యాలున్న 16 నుంచి 24 సీట్ల సామర్థ్యం గల వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల పర్యాటకులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా అడవి మృగాలను వీక్షించే అవకాశం కలుగుతుంది.

జూ పార్కులో సింహాలు, పులులను దగ్గరగా చూడాలనుకునే పర్యాటకులకు శుభవార్త. సఫారీ రైడ్ల కోసం కొత్త ఏసీ, నాన్-ఏసీ బస్సులను అద్దెకు తీసుకునేందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అత్యాధునిక సౌకర్యాలున్న 16 నుంచి 24 సీట్ల సామర్థ్యం గల వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల పర్యాటకులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా అడవి మృగాలను వీక్షించే అవకాశం కలుగుతుంది.

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కడ కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆయా జిల్లా కలెక్టర్లు హరిచందన, మనూ చౌదరి, నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు తగిన నిల్వలను ఉంచి, సమయానికి సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు

ప్రభుత్వ ఐటీ విభాగం భద్రతా వలయాన్ని ఛేదించి సైబర్ దొంగలు పడ్డారా? అంటే అవుననే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక థర్డ్ పార్టీ వెండర్ అజాగ్రత్త వల్ల సుమారు 20 లక్షల మంది వ్యక్తిగత సమాచారం ‘డార్క్ వెబ్’లో ప్రత్యక్షమైనట్లు ‘బ్రీచ్ ఆడిట్’ నివేదిక వెల్లడించింది. సమాచారం గల్లంతైన వార్తలతో అధికారులు హుటాహుటిన సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్ చేస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టారు.

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి! <<7337592828>>7337592828<<>>

TGలోని అన్ని ఎత్తిపోతల ప్రాజెక్టుల పంపు సెట్లకు తమతోపాటు TRANSCO పగటిపూట మాత్రమే కరెంట్ సరఫరా చేస్తుందని, రాత్రిపూట ఉండదని TG ఇంధన శాఖ.. రాష్ట్ర నీటిపారుదల శాఖకు తెలియజేసింది. నిధుల కొరత దృష్ట్యా ప్రాజెక్టులకు 24 గంటలపాటు కరెంట్ సరఫరా కాదని, ఇప్పటికే నీటిపారుదల విభాగంపై రూ. 33,653 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయంది. ఆర్థిక భారం దృష్ట్యా బకాయిల్లో తక్షణమే రూ.500 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేసింది.

రామరాజ్యం అంటేనే సుభిక్షం. ధర్మబద్ధమైన పాలనలో నెలకు 3 వానలతో సస్యశ్యామలమని ప్రతీతి. అదే రీతిలో శ్రీ సీతారాముల కళ్యాణం రోజు పుడమి తల్లి పులకించేలా వర్షం కురిసింది. ముక్కోటి దేవతలు అక్షింతలు జల్లినట్లు వర్షం రూపంలో కరుణించారేమో అని భక్తులు విశ్వసిస్తున్నారు. కురిసిన ప్రతి జలధారను దేవతల కరుణామృతంగా భావించిన భక్తజనం భక్తి పరవశంతో ఆస్వాదించారు. అంతా రామమయం.. జగమంతా రామమయం అని వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రేటర్ HYDలో ప్రతి సంవత్సరం సగటున సుమారు 1,370 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. FSL, జూబ్లీహిల్స్‌లో షాపింగ్ మాల్, ప్రగతినగర్‌లో ఫర్నిచర్ షాప్‌లు, కాటేదాన్‌లో ప్లైవుడ్ గోదాంలు, రాజేంద్రనగర్‌లో సెల్లార్‌లలో అగ్నిప్రమాదాలు ఇటీవలే జరిగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 90 శాతానికి పైగా ఘటనలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపు పొందిన 15వ ‘NMDC HYD మారథాన్’ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. ఈ మైలురాయి ఎడిషన్ కోసం సరికొత్త లోగోను ఆవిష్కరించారు. ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దాదాపు 32 వేల మంది పాల్గొంటారని అంచనా. ఫిట్‌నెస్ పెంచుకుంటూ నగరం గర్వపడే ఈ మెగా ఈవెంట్లో భాగస్వాములు అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం? మీ బూట్లు రెడీ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం www.nmdchyderabadmarathon.comను విజిట్ చేయండి.
Sorry, no posts matched your criteria.