India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మన హైదరాబాద్ రంగులమయంగా మారుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కనువిందు చేసేలా కుర్చీలు, LED లైట్లు, గ్రీనరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వేసిన పెయింటింగ్ వాహనదారుల చూపు తిప్పనివ్వడం లేదు. ముఖ్యంగా సెక్రటేరియట్ వద్ద మరింత ఆహ్లాదరకంగా మార్చారు. నగరంలో ఏ మూలకు పోయినా జంక్షన్లు అందంగా దర్శనమిస్తున్నాయి.
JNTU విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి ప్రతి నెల 4వ శనివారం సెలవు ప్రకటించారు. నూతన వైస్ ఛాన్స్‌లర్ కిషన్ కుమార్ ఆదేశాలతో గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వర రావు ఉత్తర్వులు విడుదల చేశారు.SHARE IT
గ్రేటర్ HYDలో ప్రజా సేవలకు ఈ నంబర్లకు కాల్ చేయండి. అధికారులు లంచం అడిగితే-1064, సైబర్ మోసం జరిగితే-1930, డ్రగ్స్ కనిపిస్తే-1908, పోలీసు సేవలకు-100, ఫైర్ హెల్ప్ లైన్-101, టెలి మానస్- 14416, చైల్డ్ హెల్ప్ లైన్-1098, ఎమర్జెన్సీ అంబులెన్స్-108, ఎయిడ్స్ హెల్ప్ లైన్-1097, కరెంటు పోతే TGSPDCL హెల్ప్ లైన్-1912, HMWSSB హెల్ప్ లైన్-155313,14420, GHMC హెల్ప్ లైన్-040-21111111 నంబర్లు అందుబాటులో ఉన్నాయి.
రంజాన్ పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని మజ్లీస్ బచావో తారిక్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లాఖాన్ ప్రశ్నించారు. గురువారం HYDలో మాట్లాడుతూ.. హిందూ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి.. ముస్లిం పండుగలపై ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ముస్లిం సంస్థలను సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ఇన్‌స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పూణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 21వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చెల్లించవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ తదితర కోర్సుల మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
తమిళనాడు హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కి వచ్చిన తమిళనాడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖ మంత్రి తిరు ఆర్.గాంధీని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి మంత్రి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు.
రవీంద్ర భారతిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగ్ బండారి హోమంలో పాల్గొన్నారు. గిరిజన జాతిని చైతన్య పరిచేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, పూజనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంత్యుత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మాసబ్‌ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌లో ఏసీబీ అధికారుల సోదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్‌గా అధికారులకు పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.