India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్‌టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

HYDలోని రహ్మత్‌నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని సంతోషిణి తన పెంపుడు కోడిపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక.. రంధ్రాలున్న బ్యాగులో కోడిని ఉంచి తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లారు. గతంలో రెండు కోడిపిల్లలను తెచ్చుకోగా.. వాటిలో ప్రస్తుతం ప్రాణంతో ఉన్న ఈ కోడిని తను ఎంతో అపురూపంగా పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.

వెస్ట్ జోన్ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. స్మార్ట్ మీటర్లు ఉన్న చోట లోడ్ పెరిగితే చాలు.. ఎవరికీ చెప్పకుండానే ‘ఆటోమేటెడ్ గ్రిడ్ షెడ్డింగ్’ సిస్టమ్ పవర్ కట్ చేస్తోంది. ACల వాడకాన్ని డిజిటల్ గ్రిడ్ ద్వారా రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తూ, గ్రిడ్ సామర్థ్యం దాటినప్పుడు ముందస్తు సమాచారం లేకుండానే లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట ఈరహస్య కోతలు విధిస్తున్నట్లు సమాచారం. వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాకుత్‌పురాలో నిజాం నవాబులకాలంలో నిర్మించిన ఈ చారిత్రక ‘లండన్ బ్రిడ్జ్’ ఇప్పుడు కూలిపోయే స్థితికి చేరింది. అప్పట్లో గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన, నేటి భారీ వాహనాల తాకిడికి తలవంచింది. ఎట్టకేలకు రూ.2.95 కోట్లతో దీని పునర్నిర్మాణానికి GHMC పచ్చజెండా ఊపింది. 2020 వరదల తాకిడికి దెబ్బతిన్న ఈవంతెనను 9 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగానికి తెరలేపింది. యువతను, తొలిసారి ఓటు వేసే వారిని ఆకర్షించేందుకు భాగ్యనగర యానిమేషన్ సృష్టి ‘ఛోటా భీమ్’ను ప్రచారకర్తగా బరిలోకి దింపింది. హౌరా జిల్లాలో ‘చునావ్ కా పర్వ్’ నినాదంతో ఈ బుజ్జి హీరో సందడి చేస్తున్నాడు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పోలింగ్‌కు ఓటర్లను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ వేశారు.

భద్రాచలం రామయ్య పెళ్లికి కోనసీమ కొబ్బరి బోండాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మండపేట గ్రామం నుంచి 24 ఏళ్లుగా రామయ్య పెళ్లిలో వినియోగించే కొబ్బరి బోండాలను రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు శంఖుచక్రాలు, తిరునామాలు, సీతారామ పేర్లతో అలంకరణ చేసి రామయ్య పెళ్లికి కానుకగా అందజేస్తున్నారు. కాగా శ్రేష్టమైన కొబ్బరి బోండాలను సేకరించి, నియమ నిష్ఠలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు.

HYD, RR, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మీ ఏరియాల్లో కరెంటు సమస్యలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు. <<8712441912>>8712441912<<>> నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్‌లో మెసేజ్ పంపితే చాలు. దీనిపై TGSPDCL సిబ్బంది స్పందిస్తారని ఆ సంస్థ తెలిపింది. బిల్లులు, మీటర్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయం వంటి ఫిర్యాదులను ఈ నంబర్ ద్వారా స్వీకరించి త్వరగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
# SHARE IT

శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 3వేల మంది పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలు మోహరించనున్నాయి. శోభాయాత్ర మ. ఒంటి గంటకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. బోయిగూడ కమాన్, ధూల్‌పేట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, హనుమాన్ టెక్డి గుండా సాగనుంది.

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచిరేవుల వద్ద 800 ఏళ్ల చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణంలో శ్రీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు పురానపూల్ దగ్గర అంతర్జాతీయ హంగులతో మెగా మసీదు, గౌలిగుడ దగ్గర గురుద్వారా, నాగోల్ దగ్గర చర్చిలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

శ్రీరామనవమి సందర్భంగా మద్యం షాపులు నేడు బంద్ ఉంటాయి. వైన్స్‌తో పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్ల, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు బంద్ చేయాలని HYDలో ఆదేశాలు జారీ అయ్యాయి. శోభాయాత్ర సందర్భంగా కీలక రోడ్లు సైతం బంద్ ఉండనున్నాయి. సీతారాంబాగ్ గుడి నుంచి సుల్తాన్ బజార్ వరకు మల్లేపల్లి, నాంపల్లి, ఆఘాపురా, మంగళ్‌హాట్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, కాచిగూడ వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి.
Sorry, no posts matched your criteria.