Hyderabad

News February 17, 2025

నుమాయిష్ ముగింపు: మంత్రి పొన్నం బహుమతులు ప్రదానం

image

నాంపల్లిలో 46 రోజులు కొనసాగిన 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) సోమవారం 2025 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. 19.72 లక్షల మంది సందర్శించిన ఈ ప్రదర్శనలో 2,000 స్టాల్స్ ఏర్పాటు కాగా, 20,000 మందికి ఉపాధి కల్పించింది. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో 20 విద్యా సంస్థలు నడుస్తున్నాయి అన్ని మంత్రి తెలిపారు.

News February 17, 2025

HYDలో చెత్త బండి.. ఇదే వీరి బతుకు బండి..!

image

గ్రేటర్ HYDలో GHMC స్వచ్ఛ ఆటో డ్రైవర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దుర్గంధ భరితపు వాసనను భరిస్తూ ఇబ్బందులు పడుతూ ఇంటి నుంచి చెత్త సేకరించి, నగర స్వచ్ఛతకు బాసటగా నిలుస్తారు. HYDలో ఓ స్వచ్ఛ ఆటోలో చెత్త బ్యాగులపైన బాలుడు ఉండటం వారి కష్టానికి నిదర్శనం అని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. CREDIT: ఫొటో జర్నలిస్ట్ లోగనాథన్

News February 17, 2025

డేటా సైన్స్ రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన పీజీఆర్ఆర్ సీడీఈ ద్వారా అందించే డేటా సైన్స్ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 22వ తేదీలోగా టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 లేట్ ‌ఫీతో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News February 17, 2025

HYDలో రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి!

image

హైదరాబాద్‌లో పైసా ఖర్చులేకుండానే ఓ జంట వివాహం చేసుకుంది. అది కూడా కేవలం రెండు నిమిషాల్లోనే. శంషాబాద్‌లోని కన్హా శాంతివనంలో సర్వేశ్వరానంద్, శ్రీవాణి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె మెడలో తాళి కట్టాడు. ప్రశాంతమైన శాంతి వనంలో ఆర్భాటం లేకుండా ఆ జంట వివాహమైంది.

News February 17, 2025

HYD: నుమాయిష్‌ ఈరోజు లాస్ట్

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్‌ నేటితో ముగియనుంది. ఆదివారం సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్‌లో వందల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రూ. 50 ఎంట్రీ ఫీజు ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం. నగరవాసులు చివరిరోజు పోటెత్తే అవకాశం ఉండడంతో తగు ఏర్పాట్లు చేశారు.

News February 17, 2025

IPLకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!

image

హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్. IPLకు ఉప్పల్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్ తెలిపారు. స్టేడియంలో నూతనంగా సీట్లను అమర్చుతున్నారు. వెస్ట్, ఈస్ట్ స్టాండ్‌లపై అభిమానుల సౌకర్యార్థం పందిరి వేస్తున్నట్లు పేర్కొన్నారు. IPL నిర్వహణలో హైదరాబాద్ అత్యుత్తమ హోస్ట్‌గా నిలుస్తుందని, ఇందుకు కృషి చేస్తామని జగన్ వెల్లడించారు.

News February 17, 2025

HYDలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కిలో చికెన్ రూ. 180 నుంచి రూ. 190 వరకు అమ్మారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో మాంసం ప్రియులు మటన్‌, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపారు. ఈ ప్రభావంతో సోమవారం ధరలు తగ్గించారు. విత్‌ స్కిన్ KG రూ. 148, స్కిన్‌లెస్ KG రూ. 168గా ధర నిర్ణయించారు. ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102 ఉంది. నిన్న ఓల్డ్ సిటీలో లైవ్‌ చికెన్‌ను రూ. 40కే విక్రయించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.

News February 17, 2025

HYDలో నేడు డ్రింకింగ్ వాటర్ బంద్

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో డయా వాల్వులు అమర్చుతున్నారు. ఈ కారణంగా SRనగర్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, మూసాపేట, చింతల్, సుచిత్ర, అల్వాల్‌, చరపల్లి, మాదాపూర్, కొండాపూర్‌, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. రేపు ఉదయం వరకు సరఫరా ఉండదు.
SHARE IT

News February 17, 2025

గ్రేటర్ HYDలో తగ్గిన భూగర్భ జలాలు

image

గ్రేటర్ పరిధిలో భూగర్భ జల శాఖ విశ్లేషణలో HYD ఔటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జలాలు 1.33 మీటర్లు తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గగా, 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరి చివరి నాటికి సరాసరిగా 9.4 మీటర్ల భూగర్భ జలాలు ఉన్నాయి.

News February 16, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.