India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BJP సహకారంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వలేదని చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఎన్నటికీ BRSతో కలవమని తేల్చి చెప్పారు. గతంలో INC ఎమ్మెల్యేలు కారెక్కారన్నారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు మళ్లీ హస్తం కండువా కప్పుకొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కొండా ఆరోపించారు.
చెరువులను కాపాడేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘గృహ’ అనే పర్యావరణ సంస్థ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు ప్రతీది మానవాళి మనుగడుకు అవసరమేనని పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని అన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
SHARE IT
హైదరాబాద్లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ స్తంభాల నుంచి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను TGSPCDL మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ శుక్రవారం ఆదేశించారు. తొలగించనివారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లు తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.
HYD నగర ప్రజలకు తాగునీరు అందించే గండిపేట ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ బాధ్యతలను కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా పరిధిలో ప్రస్తుతం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వాటిని మరింత పెంచి, బలోపేతం చేస్తామన్నారు. కలెక్టర్లు, సీపీ, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాల గురించి వివరించారు.
విపత్తుల నియంత్రణపై పదేళ్లుగా ప్రణాళిక లేకపోవడంపై మంత్రి పొంగులేటి విస్మయం వ్యక్తం చేశారు. గురువారం 9 విభాగాల అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే 2నెలల్లో హైదరాబాద్, గోదావరి పరివాహక జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.