India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బడ్జెట్ రిప్లైలో భాగంగా నేడు అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మాట్లాడనున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో లోటుపాట్లు, 6 గ్యారంటీలకు నిధుల లేమి, అన్ని వర్గాలకు మోసం చేసిన కాంగ్రెస్ తీరు, విపరీత, అనాలోచిత నిర్ణయాలతో మందగించిన ఆర్థిక వృద్ధి, నిలిచిపోయిన సంక్షేమం, తదితర అంశాలపై పూర్తి ఆధారాలు గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతోందనే ఆరోపణలతో QNET సంస్థపై HYD పోలీసులు కొరడా ఝుళిపించారు. ఉదయం నుంచే నగరం సహా 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ సంచలనం సృష్టించారు. సుమారు 25 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా, పొరుగునున్న మరో 2 రాష్ట్రాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో 20 మంది నిందితులను గుర్తించారు.

పాడైన వస్తువులను మరమ్మతు చేసుకునే సంస్కృతి క్షీణిస్తోంది. కొత్తవి కొనుగోలు చేసే ధోరణి నగరవాసుల్లో వేగంగా పెరుగుతోందని టాక్సిక్స్ లింక్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో దేశంలోని ప్రధాన నగరాల్లో HYD అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ఆదాయ వర్గాల్లోనూ ‘రీప్లేస్మెంట్ ట్రెండ్’ స్పష్టంగా ప్రాబల్యం సాధించినట్లు తేలింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విషయంలో మార్పిడి అధికంగా ఉన్నట్లు నిర్ధారించింది.

రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కఠినతరం కానుందని HYDలోని ఓ ఆర్టీవో అధికారి తెలిపారు. LLR, శాశ్వత పరీక్షలకు అదనంగా ఇకపై 3 గంటల ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్షను ప్రవేశపెడుతున్నారు. 6 పార్టులుగా ఉండే ఈ పరీక్ష ద్వారా వచ్చిన సర్టిఫికెట్ నంబర్‌తోనే లెర్నర్ లైసెన్స్ టెస్టుకు అర్హత లభిస్తుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలుకు అవకాశం ఉంది.

HYD, ఉమ్మడి RRలోని SC యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025-26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హతగల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 24వ తేదీ(రేపటి) వరకు అప్లై చేసుకోవాలని ఆమనగల్లు MPDO మాధురి సూచించారు. వెబ్‌సైట్ <
# SHARE IT

నేడు 10 గం.కు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం తరుఫున మంత్రులు 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలోను బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు బడ్జెట్‌పై తీవ్రంగా గగ్గోలు పెడుతున్నాయి, ప్రజలకు న్యాయం చేయకుండా కార్పొరేట్ పాలసీకి న్యాయం చేస్తూ అధికార నేతలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. రోజుకో అంశంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. నేడు జరిగే సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై శాసనసభ, శాసన మండలిలో చర్చ కోసం బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. రోజుకో అంశంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. నేడు జరిగే సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై శాసనసభ, శాసన మండలిలో చర్చ కోసం బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది.

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.

BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు రేపు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని BJP ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. సిటీలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు.
Sorry, no posts matched your criteria.