India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. త్రిషకు రూ.10 లక్షలు, ఆమె హెడ్ కోచ్‌కు రూ.5 లక్షలు, ట్రైనర్ శాలినికి రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. మరోవైపు ఆమెకు సీఎం రేవంత్ రూ.కోటి నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.
ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మృతదేహం కలకలం రేపింది. మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల వివరాలు.. నిన్న రాత్రి కాగజ్‌నగర్ నుంచి బీదర్ వెళుతున్న రైలు కింద పడి వ్యక్తి చనిపోయాడు. తల మీదుగా ట్రైన్ వెళ్లడంతో ముఖం ఛిద్రమైంది. ఇది గమనించిన ట్రైన్ కో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
GHMCలో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్‌లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపి అమలుపరిచిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయోత్సవ సంబరాలలో భాగంగా ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయంతో యూరిన్ శాంపిల్ తీసుకోకుండానే మూత్ర ఇన్ఫెక్షన్లను గుర్తించి.. HYD సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా సైన్వీ బయోసైన్స్, ఆస్ఫైర్ బయోనెస్ట్ సంయుక్తంగా మోడల్ ఆవిష్కరించింది. 2024లో జరిగిన AI ఆధారిత ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలో 24వ ర్యాంకును ఈ మోడల్ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ అద్భుతాలు సృష్టించబోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.
కూకట్‌పల్లి PS పరిధిలోని భాగ్యనగర్ కాలనీ అల్లూరి ట్రేడ్ సెంటర్ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది మహిళలను కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.