Hyderabad

News July 26, 2024

HYD: కుమారుడి ప్రాణం పోతుంటే తల్లడిల్లిన తల్లి!

image

HYD శంషాబాద్‌లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.

News July 26, 2024

గ్రేటర్ HYDలో అదనంగా మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

News July 26, 2024

HYD: మానవత్వం చాటుకున్న అల్వాల్ ట్రాఫిక్ ACP

image

విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్‌లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.

News July 26, 2024

మెట్రోరైలు రెండోదశలో పెరిగిన దూరం

image

HYDలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు.

News July 26, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హత్య

image

HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 26, 2024

వట్టి నాగులపల్లి: నేడు ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్

image

అగ్నిమాపక శాఖలో కొత్తగా చేరి శిక్షణ పూర్తి చేసుకున్న 483 ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ నేడు జరగనుంది. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఇటీవల డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన 157 మంది అభ్యర్థులు కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.

News July 26, 2024

గ్రేట్ ట్రైనింగ్: ఒలింపిక్స్‌కు తీసుకెళ్లిన హైదరాబాద్‌!

image

ట్యాలెంట్ ఉన్న ఎందరికో ‘హైదరాబాద్’ లైఫ్ ఇచ్చింది. ఇక్కడ శిక్షణ తీసుకొని నేడు ఏడుగురు ఒలింపిక్స్‌‌కు ఎంపికయ్యారు. AP, TGలో 8 మంది సెలక్ట్ అవగా అందులో ఏడుగురు‌ HYDలో శిక్షణ తీసుకున్నవారే . PV సింధు, నిఖత్ జరీన్ లాంటి అంతర్జాతీయ‌ క్రీడాకారులకూ నగరంతో అనుబంధం ఉంది. సాత్విక్ సాయిరాజ్, శ్రీజ, ఇషా సింగ్, జ్యోతి, దండిజ్యోతిక శ్రీ‌‌ కూడా ఈ ఒలింపిక్స్‌లో అదరగొట్టి ఇంకా గొప్ప స్థాయికి చేరాలని ఆశిద్దాం.

News July 26, 2024

హైదరాబాద్‌‌లో అభివృద్ధి జరిగిందా?

image

HYD అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేత‌లు వాదోపవాదాలు చేస్తున్నారు. నగరంలో‌ ఫ్లై ఓవర్లు తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని‌ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క‌ అన్నారు. అభివృద్ధి జరగలేదని‌ తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్‌ రావు ఘాటుగా బదులిచ్చారు. లోకం అంతా హైదరాబాద్‌ను మెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ గజినీలకు ఇది కనిపించదని ఎద్దేవా చేశారు. మరి గత 10 ఏళ్లలో నగర అభివృద్ధిపై హైదరాబాదీగా మీ కామెంట్?

News July 26, 2024

రాజధాని ఏసీ బస్సుల ధరలకే ఈ గరుడ బస్సులు

image

TGSRTC E-గరుడ బస్సులను రాజధాని AC బస్సు ధరలోనే నడపాలని యజమాన్యం నిర్ణయించినట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు బుకింగ్ చేసిన ప్రయాణికులకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

News July 25, 2024

HYD: సచివాలయంలో నేడు బోనాల వేడుకలు

image

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ నేడు సచివాలయంలో బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలోని నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో సచివాలయంలోని ద్వారాల వద్ద అమ్మవారు, ఆదిశేషుడు తదితర ప్రతిమలను ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం బోనాల వేడుకల్లో పాల్గొంటారు.