India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత కార్డుదారుల్లో మరణించినవారి వివరాలను తొలగించి.. కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో సర్కిల్‌లో సుమారు 20 వేల వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం HYDలో 2.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను గుర్తించనున్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొద్దిసేపు టీచర్‌గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నైపుణ్యాలను గవర్నర్ స్వయంగా పరీక్షించారు. దృఢసంకల్పంతో తమ కలలను సాకారం చేసుకోవాలని, సమాజంపై బాధ్యతను పెంచుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.
పార్ట్ టైం జాబ్స్, షేర్ మార్కెట్, ఫెడెక్స్ కొరియర్‌తో బెదిరింపులు.. ఇలా గుజరాత్ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తరచూ చిరునామా మార్చుతూ పోలీసులను ఏమార్చటం వీరి ప్రత్యేకత. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గుజరాత్‌లో మకాం వేసి నేరస్థులను గుర్తించారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై మన రాష్ట్రంలోనే 100కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది.
నగరంలో చెత్త సేకరణ రోజురోజుకూ మందగిస్తోంది. 20 లక్షల ఇళ్ల నుంచి ఉత్పత్తయ్యే చెత్తను సేకరించడానికి బల్దియా 4,500 స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసిన, సరిగా చెత్త క్లియర్ చేయడం లేదు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్‌లో 1800 మంది డెంగ్యూ, 2220 మంది మలేరియాతో చికిత్స పొందుతున్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ రూ.10 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోతోంది.
పాతబస్తీ మార్గంలో మెట్రోరైలు కోసం రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జారీ చేశారు. సేకరించాల్సిన ఆస్తులను గుర్తించగానే విడతలవారీగా ప్రకటనలు ఇస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గంలో మెట్రో కోసం 1200 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని హెచ్ఎఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 8 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.
మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ పోరాటంలో ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారి మిత్రులు తెలిపారు.
తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి నేతృత్వంలో శుక్రవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను తార్నాకలో కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు.
విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24వ తేదీన శనివారం వందలాది మంది విద్యార్థులతో మాసబ్ ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. శుక్రవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరవుతారన్నారు.
కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డబ్బులు విసిరి న్యూసెన్స్ క్రియేట్ చేసిన వంశీ కుమార్ (24) అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు వెదజల్లే వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి సీఐ ముత్తు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.