India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపింది. కానీ.. గ్రేటర్ వ్యాప్తంగా లక్షల్లో లబ్ధిదారులు అర్హులైనప్పటికీ తమకు సబ్సిడీ అందటం లేదని, GHMC కార్యాలయాల వద్ద అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ప్రజాపాలనలో తాము దరఖాస్తు చేసుకున్నామని, 200 యూనిట్ల ఉచిత కరెంటు వస్తున్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ రావడం లేదని ఉప్పల్ GHMC ఆఫీస్ వద్ద పలువురు వాపోయారు. మీకు సబ్సిడీ రావడంలేదా? కామెంట్ చేయండి.
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి నాడే ఇబ్రహీంపట్నం MLA ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం తన సోదరి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగేటి భూదేవి నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ రోజు వారి స్వగ్రామం తొర్రూరులో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన HYD- నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్‌కు ఆదరణ అంతంత మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి 19న ఈ ట్రైన్‌ను 20 కోచ్‌లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కోచ్‌ల సంఖ్య ఒక్కసారిగా 8కి తగ్గించారు. అయినా ఆక్యుపెన్సీ రేషియో 70% మాత్రమే ఉంది. డిమాండ్‌లేని ఈ రూట్‌లో ట్రైన్ ప్రారంభించడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు.
మహానగరంలో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. దీంతో గ్రేటర్ అధికారులు పది రోజుల్లో మొత్తం తరలించేశారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 10 రోజుల్లో దాదాపు 2,297 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించారు. 150 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపట్టి క్లీన్ సిటీగా మార్చేందుకు నడుం బిగించారు. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 1,992 మెట్రిక్ టన్నుల చెత్త కాగా.. 1,005 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉన్నట్లు లెక్కతేల్చారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై హెచ్సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్‌తో HCA ఎన్నికల్లో గెలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్లు నడుస్తున్నాయన్నారు. మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్ నిబంధనలకు విరుద్ధమన్నారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యలో వెనుకబడ్డ ఆదివాసీ విద్యార్థులకు ఉచితంగా విద్య అందివ్వాలని నిర్ణయించినట్లు వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి వెల్లడించారు. డిగ్రీ కోర్సులకు రూ.3,200 ఫీజు ఉంటుందని.. గిరిజన విద్యార్థులకు భారం కాకూడదని రూ.500 నామమాత్రపు ఫీజుతో అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. వివరాలకు 040-23680333 నంబరుకు కాల్ చేయొచ్చని తెలిపారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పలు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పా చక్రపాణి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేట్ ఫీతో సెప్టెంబర్ 4 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాలకు 040–23544741, 23680411 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
సోదర సోదరీమణుల అనురాగ ఆప్యాయతకి రాఖీ ప్రతీకగా జరుపుతారు. HYD, ఉమ్మడి రంగారెడ్డిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షంతో దూరప్రాంతాల నుంచి వచ్చే అక్కాచెల్లెళ్లు రాక సోదరులు దిగాలుగా ఎదురుచేశారు. పలుచోట్ల ప్రయాణం మధ్యలో ఇబ్బందులు పడ్డా.. అర్ధరాత్రి ఇంటికి చేరి కట్టారు. చిన్నప్పటి నుంచి ఒక్కసారీ మిస్ కానీ ‘రాఖీ’ ఈ ఏడాది వర్షం కారణంగా కట్టుకోలేకపోయామని బాధపడ్డారు. మీరూ ఈ ఏడాది రాఖీ మిస్ అయ్యారా?
సాంకేతిక సమస్యలు, వాతావరణ ప్రతికూలత వల్ల నిన్న పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలిగింది. అహ్మదాబాద్ నుంచి HYDకు వచ్చే విమానం 5 గంటలు ఆలస్యంగా వచ్చింది. శంషాబాద్- సాయంత్రం రస్‌అల్‌ఖైమానా బయలుదేరాల్సిన విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. భారీ వర్షం కారణంగా షార్జా వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా టేకాఫ్‌తీసుకుంది. మరో 2 దేశీయ విమానాలు గంట ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి.
వేతనాల పెంపు కోసం ఈ నెల 1 నుంచి సినీ కార్మిక యూనియన్లు షూటింగ్స్‌కు బంద్ పాటిస్తున్నాయి. గత సోమవారం సారథి స్టూడియోలో ఒక సీరియల్‌కు సంబంధించి కాస్ట్యూమర్ యూనియన్ ప్రతినిధి సత్యనారాయణ పనిచేస్తుండగా అధ్యక్షుడు శ్రీనివాస్ మరో ముగ్గురు వెళ్లి దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స అనంతరం బాధితుడు ఆదివారం మధురానగర్ PSలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.