Hyderabad

News August 20, 2024

HYD: ‘ఆంధ్రావారికి అధ్యక్ష పదవిపై నేతల అసంతృప్తి’

image

కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన యడవల్లి వెంకటస్వామిని AICC నియమించడంపై తెలంగాణ విద్యార్థి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖాస్త్రాలు సంధించారు. వెంకటస్వామిని తొలగించాలని, తెలంగాణ వ్యక్తికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని డిమండ్‌ చేశారు.

News August 20, 2024

HYD: ‘సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహమే సరైంది’

image

రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయమని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, తిగుళ్ల కృష్ణమూర్తి, ఏలె లక్ష్మణ్ తదితరులు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

News August 20, 2024

సికింద్రాబాద్: రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం: జూపల్లి

image

భారాస ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు, రూ. 40 వేల కోట్ల బకాయిలు మిగిల్చిందని.. అవి భారంగా మారినా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలిచిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘నిబంధనల ప్రకారం స్పష్టంగా ఉన్న బ్యాంకు ఖాతాలకు వెంటనే రుణమాఫీ అమలు చేశాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఆధార్, పాస్ పుస్తకాల సమాచారం గందరగోళంగా ఉంది’ అన్నారు.

News August 20, 2024

HYD: లాయర్‌ సంతోష్‌పై చట్టప్రకారమే వ్యవహరించారు: సీపీ 

image

బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.

News August 20, 2024

HYD: ఆస్పత్రుల్లో తీరనున్న క్యూలైన్ కష్టాలు

image

ఓపీ చీటి కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద లైన్‌లో గంటలకొద్ది నిలబడతాం. ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో 2 నిమిషాల్లోనే ఓపీ చీటి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ రాజేంద్రనాధ్ అన్నారు. ‘అభా’ యాప్‌తో క్యూలైన్ కష్టాలు తీరనున్నాయి. ఓపీ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభా యాప్‌లో వివరాలు నమోదు చేస్తే ఓపీ చీటీ వస్తుంది. దీన్ని డాక్టర్లకు చూపించి సేవలు పొందొచ్చు.

News August 20, 2024

HYD: జేఎన్టీయూహెచ్‌లో బీ-ఫార్మసీ కోర్సు

image

జేఎన్టీయూహెచ్‌లో ఈ ఏడాది(2024-25) నుంచే బీ-ఫార్మసీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ఫార్మసీ విభాగం హెచ్వోడీ డాక్టర్ ఎస్.శోభారాణి తెలిపారు. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయని.. ఇప్పటికే వీటి భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ అధికారులకు వివరాలు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎం-ఫార్మసీలో 4 కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో కోర్సులో 15సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News August 20, 2024

HYD: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంతో వయోజనులు, గృహిణులు కనీస విద్యార్హతలైన పదో తరగతి, ఇంటర్ సాధించేందుకు ఈ విధానం ఎంతో సహకరిస్తుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అంతర్జాల కేంద్రాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రవేశాలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 10వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 20, 2024

HYD: ఒకే నెలలో 22.6 లక్షల మంది ప్రయాణం..!

image

HYD నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జులైలో 22.6 లక్షల మంది ప్రయాణించారు. గత ఏడాది కంటే 13% ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుందని పేర్కొన్నారు. భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, నూతన వసతులను కల్పించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు.

News August 20, 2024

HYD: ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆమ్రపాలి

image

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలతో కలిసి కమిషనర్‌ ఆమ్రపాలి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 25 అర్జీలు రాగా, టెలిఫోన్‌ ద్వారా 4 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

News August 19, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొండా సురేఖకు వారు ధన్యవాదాలు తెలిపారు. సోదర, సోదరీమణుల ప్రతి రూపమైన వేడుక రాఖీ పౌర్ణమి అని పేర్కొన్నారు.