Hyderabad

News August 8, 2025

బాలుడిపై జూబ్లీహిల్స్ పోలీసుల థర్డ్ డిగ్రీ.. HRC సీరియస్

image

జూబ్లీహిల్స్ PSలో బాలుడి (17)పై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 15-17, 2024లో మధ్య అక్రమ నిర్బంధం, చిత్రహింసలపై బాధిత తండ్రి దగ్గుపాటి రాంబాబు HRCకి ఫిర్యాదు చేశారు. బాలుడి ఆరోగ్యం విషమంగా మారిందని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో నివేదిక ఇవ్వాలని కమిషనర్ సీవీ ఆనంద్, నిమ్స్ సూపరింటెండెంట్‌లను కమిషన్ ఆదేశించింది.

News August 8, 2025

‘గాంధీ’లో అధ్వాన పరిస్థితి.. HRC సీరియస్

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై HRC సీరియస్ అయింది. ఏడాదిగా లిఫ్టులు పనిచేయకపోవడం, వంట గదిలో పురుగులు, ఎమర్జెన్సీ బ్లాక్ సమస్యలు, మార్చురీలో శవాలు రోజుల తరబడి పేరుకపోవడం తదితర సమస్యలు HRC దృష్టికి వెళ్లాయి. ఆగస్టు 27 నాటికి సమగ్ర రిపోర్ట్ తయారుచేసి అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

News August 8, 2025

వర్షం ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించిన సీఎస్, సీపీ

image

HYDలో కురిసిన భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్‌ల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, కమిషనర్ సీవీ ఆనంద్‌ బుధవారం బంజారాహిల్స్‌లోని TGICCC వార్ రూమ్‌నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రంతా వర్షం కురవడంతో అక్కడే ఉండి అధికారులకు పలు సూచనలు చేశారు.

News August 8, 2025

భారీ వర్షాల ఎఫెక్ట్: కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్

image

వర్షాల నేపథ్యంలో HYD కలెక్టర్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో వర్షాల వలన ఇండ్లలో నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ ఫోన్ నం. 040 2302813, 7416687878కు కాల్ చేయాలన్నారు. సంబంధిత అధికారులతో సమస్యలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

News August 8, 2025

బంజారాహిల్స్ ఐసీసీసీలో సీఎస్ రామకృష్ణ రావు

image

GHMC పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News August 7, 2025

భారీ వర్షం.. అమీర్‌పేట మెట్రోలో రద్దీ

image

HYDలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్‌కాలనీలో 11.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక భారీ వర్షంలో సొంత వాహనాల్లో ప్రయాణం డేంజర్ అనుకున్నారేమో నగరవాసులు మెట్రోకు క్యూ కట్టారు. రాత్రి 8 గంటల సమయంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో వందలాది మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు పోటీ పడ్డారు.

News August 7, 2025

HYD: టెన్షన్ ఎందుకు దండగా.. స్పెషల్ ట్రైన్ ఉండగా!

image

నగరం నుంచి కాకినాడ వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. చర్లపల్లి నుంచి కాకినాడకు 8న (శుక్రవారం) (07031), 10న(ఆదివారం) కాకినాడ నుంచి చర్లపల్లికి (07032) ఈ రైలు బయలుదేరుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 7.30గంటలకు, కాకినాడ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరుతుందని CPRO శ్రీధర్ శుభవార్త తెలిపారు. రాఖీ పండుగ కోసం వెళ్లే ప్రయాణికులు స్పెషల్ సర్వీసును సద్వినియోగం చేసుకోండి.

News August 7, 2025

HYD‌లో సొంత వాహనాలే ముద్దు!

image

మహానగర ప్రజలు సొంత వాహనం లేనిదే బయటకు అడుగు వేయడం లేదని తేలింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో ట్రైన్, ఎంఎంటీఎస్ ఉపయోగించే వారి సంఖ్య తగ్గిపోయిందని హెచ్ఎండీఏ చేయించిన సర్వేలో తేలింది. 2011లో బస్సులు ఉపయోగించే వారు 42% మంది ఉండగా ఇపుడు 35 % మంది మాత్రమే ఎక్కుతున్నారు. మెట్రోలో వెళ్లేవారి సంఖ్య 3% ఉందని తేలింది. కార్లను ఉపయోగించే వారు 4 % నుంచి 16 %, బైక్స్ వాడేవారు 38% నుంచి 48 శాతానికి పెరగడం విశేషం.

News August 7, 2025

HYD: సృష్టి మాయ.. తల్లిదండ్రుల్లో బాధ

image

సృష్టి నిర్వాకంతో పలువురు తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి. పోలీసుల కస్టడీలో ఉన్న డా.నమ్రత ఇచ్చిన స్టేట్మెంట్‌తో ఆందోళన చెందుతున్నారు. సరోగసి పేరుతో తమకు ఇచ్చిన 80 మంది పిల్లలు అసలు తమ పిల్లలేనా? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. DNA పరీక్షలు చేస్తేగానీ అసలు విషయం తెలియని పరిస్థితి. DNAలో తమ బిడ్డ కాదని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సృష్టి చేసిన మాయ చివరకు తల్లిదండ్రుల్లో బాధ మిగిల్చింది.

News August 7, 2025

HYD: ప్రైవేట్ ట్రావెల్స్‌తో పరేషాన్!

image

ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోతున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఒక ప్రయాణికుడి నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నారు. తాజాగా కొందరు డ్రైవర్లు మద్యం తాగి బస్సులు నడుపుతూ పట్టుబడ్డారు. అమాయకుల ప్రాణాలతో ప్రైవేట్ బస్సుల యాజమాన్యం చెలగాటమాడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.