India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సెమిస్టర్-2 పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. UG, PG చదువుతున్న విద్యార్థులకు ఈనెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఉ.11:00 నుంచి మ. 2:00 వరకు నాంపల్లి, బాచుపల్లి, వరంగల్ క్యాంపస్‌లో పరీక్షలు జరగనున్నాయి. శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడి క్యాంపస్ విద్యార్థులకు బ్యాక్ లాక్ పరీక్షలు హైదరాబాద్‌లోని బాచుపల్లి క్యాంపస్‌లో నిర్వహించనున్నారు.
డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు సిటీ కాలేజీ మంచి అవకాశం కల్పిస్తోందని ప్రిన్సిపల్ తెలిపారు. 2007-19 మధ్య డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు వన్ టైం చాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు నిర్ణీత అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనికి ఈ నెల 12 చివరి తేదీ అని, రూ.500 ఆలస్య రుసుంతో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పబ్లిక్ గార్డెన్‌లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ‘మూలవాసీ ఉరుములు- మెరుపులు’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రొ.జయధీర్ తిరుమల్‌రావు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి ఆదివాసీ కళాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సా. 6 నుంచి జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి పాల్గొంటారన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నెల 15, 16 తేదీల్లో గ్రేటర్ పరిధిలోని అన్ని పశువుల కబేళాలు, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి మునిసిపల్ అధికారులకు సహకరించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లను కోరారు.
ఊరోదిలి సర్టిఫికేట్లతో HYD వచ్చిన బ్యాచిలర్ల కథ ఎవరినైనా కదిలిస్తుంది. సగటు యువతకు రూ.20- 25Kలోపే సాలరీ వస్తున్నట్లు ఓ స్టడీ తేల్చింది. కాస్ట్‌లీ సిటీలో ఇరుకు గదికే అద్దే సింహభాగం పోతుంది. మిగిలిన దాంతో EMIలు, అక్కాచెళ్లెళ్ల పెళ్లిళ్లు చేస్తే అప్పులకు వడ్డీలు, తిండి, బట్ట చూసుకోవాలి. ఊర్లో ఉన్న తల్లిదండ్రులకు నెలనెలా కొంత పంపాలి. ఒక్కో రూపాయి ఆచీతూచీ ఖర్చుపెడుతూ ఆనందంగా బతకడం వారికే సాధ్యమేమో కదా!
30 ఏళ్ల లోపే థైరాయిడ్, షుగర్ రావటం యువతను కలవరపెడుతుంది. గాంధీ, ఉస్మానియా, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కుషాయిగూడ హెల్త్ సెంటర్ తదితర ప్రాంతాల్లో 25- 28 ఏళ్ల వారిలో థైరాయిడ్, షుగర్ గుర్తించి డాక్టర్లే షాక్ అవుతున్నారు. వీరిని ఆరా తీయగా.. జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్‌ఫుడ్, ఆహారపు అలవాట్లు మారటం, ఒత్తిడి, స్లీపింగ్ సైకిల్ మారటం లాంటి కారణాలు ఎక్కువయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు.
దేశంలో భాషా ప్రాతిపదిక మీద 1985 DEC 2న HYDలో తెలుగు యూనివర్సిటీ ఆవిర్భవించింది. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా, 2025 మార్చి 18న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా దీనికి 2సార్లు నామకరణం చేశారు. AP, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు భాష అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభమైంది. ఇందులో 1985 మార్చి 13న తూమాటి దొణప్ప ప్రత్యేకాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
HYDకు చెందిన రితిక బజాజ్ భర్త డా.దీపక్ వాగ్రే సహకారం, తల్లిదండ్రుల ప్రేరణతో 20 ఏళ్ల కుమారుడు ఉన్నప్పటికీ ఉన్నత చదువులు చదవాలనే కోరికతో MCom, MBA, BEd, ఏపీ సెట్, PhD పూర్తి చేశానని తెలిపారు. HYDలోని బస్సు డిపోల పనితీరుపై రితిక పరిశోధన చేసి బుధవారం పాలమూరు యూనివర్సిటీలో PhD సమర్పించారు. ఆమెని రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
లోవర్ ధూల్‌పేట్ మినీ స్టేడియంలో ఆగస్టు 9 నుంచి 12 వరకు శ్రీ లాలా పెహిల్వాన్–శ్రీ బాలాజీ పెహిల్వాన్ మెమోరియల్ రెస్లింగ్ టోర్నమెంట్ 2025-26 నిర్వహిస్తున్నారు. 17 వేర్వేరు వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. లెజెండరీ కుస్తీ ఆటగాళ్ల వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ పోటీలు ప్రతియేటా కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయి టాప్ కుస్తీ వీరులు ఈ రింగులో పాల్గొంటారు. ప్రవేశం ఉచితం.
Sorry, no posts matched your criteria.