India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పళని, DCP డా.లావణ్యతో కలిసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
హైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. చింతల్‌బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేసి మాట్లాడారు. రోగులకు టెస్ట్‌లు చేసి, వైద్య చికిత్సలు అందించాలని ఆమె సూచించారు.
నారాయణగూడ బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 7వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యక్ష ఇంటర్వులుంటాయని కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో పీజీ స్థాయిలో 55% మార్కులు ఉండాలి. బోధనానుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఓయూ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్- ఈవినింగ్) పరీక్షల తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ఈనెల 5వ తేదీ నుంచే ప్రారంభించినప్పటికీ, పరీక్షలు నిర్వహించబోయే తేదీలను మార్చినట్లు చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షల ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఈరోజు తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ), బీఈ (నాన్ సీబీసీఎస్), బీఈ (సీబీసీఎస్) కోర్సుల ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్షల ఫీజును ఈనెల 11 వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
HYD బాచుపల్లి PS పరిధిలోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న మూసాపేట్ అంజయ్య నగర్‌కు చెందిన స్టూడెంట్ నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
AP TDP ఎంపీ కుమారుడిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని KPHB పోలీసులు ఈరోజు తెలిపారు. KPHBలో సితార ఉమెన్స్ హాస్టల్ నిర్వాహకురాలికి నమ్మకంగా వ్యవహరించి, బంగారు చైన్ డిజైన్ చేస్తానంటూ 4తులాల గొలుసు, రూ.లక్షను దండుకున్నాడన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అనుమానం వచ్చి మహిళ PSలో ఫిర్యాదు చేసింది. అతడిపై AP, TGలో ఇప్పటికే 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. 2010బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ టి.కిరణ్ HYD మీర్‌చౌక్ PSలో విధులు నిర్వహిస్తూ 8ఏళ్ల క్రితం సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ ఎత్తివేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చిలకలగూడ PSపరిధి శ్రీనివాస్ నగర్‌లోని తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60శాతం గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
నాగారంలోని భూదాన్ భూములపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పోలీసులు బెదిరిస్తున్నారని పిటీషనర్ రాములు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భూదాన్ భూములపై పిటీషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించగా హాజరైన కానిస్టేబుల్ వేంకటేశ్వర్లు, సీఐ వేంకటేశ్వర్లు చెప్పినందుకే ఫోన్ చేసినట్లు తెలిపారు. మరోసారి రిపీట్ కావద్దని హైకోర్టు తెలిపింది.
Sorry, no posts matched your criteria.