India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహానగరంలో ఈ రోజు కూడా వర్షం పడే అవకాశాలుండటంతో గ్రేటర్, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నగరంలో ఎక్కడైనా వరదముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. 9000113667 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులకు చిత్తశుద్ధి ఉంటే 42% బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై అన్ని పార్టీలు బీసీల నినాదాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లకు అడ్డు ఎవరూ లేరని, కానీ ఈ 3 పార్టీలు నయానాటకానికి తెరతీస్తున్నాయన్నారు.
GHMC పౌరసేవలకు సంబంధించి రోజురోజుకూ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. వీటికి చెక్ పెట్టేందుకు అధునాతన టెక్నాలజీని వినియోగించాలని గ్రేటర్ కమిషనర్ నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ (AI)ను మించిన టెక్నాలజీ వాడనున్నారు. గూగుల్ క్లౌడ్ ఫాం సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (జెన్ ఏఐ) ఉపయోగించనున్నారు. ఈ మేరకు గూగుల్ టీమ్‌తో సమావేశం నిర్వహించారు.
మేడిపల్లికి చెందిన <<17304987>>బాలిక(17)తో<<>> అలియాబాద్‌కు చెందిన రవితేజ్‌కు స్నాప్‌చాట్‌లో పరిచయం ఏర్పడింది. తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడనే వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని మాయమాటలతో నేరుగా ఇంటికే వచ్చేశాడు. అలా వారింట్లోనే బాలికతో 2 నెలలు సహజీవనం చేశాడు. గమనించిన బంధువులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఇన్స్‌పెక్టర్ గోవిందరెడ్డి తెలిపారు.
సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. రోడ్లపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్. వాహనాలన్నీ ఇరుక్కుపోయాయా అన్నట్లు పరిస్థితి ఏర్పడింది. ఎల్బీనగర్- చాదర్‌ఘాట్, నాంపల్లి- ఎంజే మార్కెట్, కూకట్‌పల్లి- పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్- పంజగుట్ట, మెహిదీపట్నం- లక్డీకపూల్, మెట్టుగూడ- నాగోల్, బేగంపేట- సికింద్రాబాద్ తదితర ప్రధాన రోడ్లల్లో వాహనాలు కి.మీటర్ల మేర వందల్లో బైకులు, కార్లు ఆగాయి.
ప్రజావాణిలో అందే ఫిర్యాదులతో పాటు వాట్సప్‌లో అందే ఫిర్యాదులకూ ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. HYD పరిధిలో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం వాట్సప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అధికారులు వాట్సప్ ఫిర్యాదులపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
సృష్టి కేసులో నేటితో డాక్టర్ నమ్రత కస్టడీ ముగియనుంది. 4రోజుల పాటు ఆమెను గోపాలపురం పోలీసులు విచారించారు. A3 కళ్యాణి అచ్చయమ్మ, A6 సంతోషిని 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో పోలీసుల ప్రశ్నలకు ముగ్గురు నిందితులు నోరుమేధపట్లేదని సమచారం. కళ్యాణి, సంతోషిని చైల్డ్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.
ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట రైల్వే బ్రిడ్జి కింద సోమవారం జగద్గిరిగట్టకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జున్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఎమ్మెస్సీ ఆడియాలజీ, ఎమ్మెస్సీ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫీజును ఈనెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్ డీ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆరేళ్ల ఫార్మ్ డీ మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదో సంవత్సరం మెయిన్, బ్యాక్ లాగ్, మూడేళ్ల ఫార్మ్ డీ మొదటి, రెండో సంవత్సరం మెయిన్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.