Hyderabad

News August 15, 2024

HYD: దేశ విశిష్టతపై అవగాహన కల్పించాలి

image

పిల్లలకు బాల్యం నుంచే దేశ విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని రాచకొండ సీపీ ఐపీఎస్‌ సుధీర్ బాబు ఐపీఎస్ సూచించారు. రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.

News August 15, 2024

తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

News August 15, 2024

సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎస్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని కొనియాడారు.

News August 15, 2024

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్

image

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ వర్సిటీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.

News August 15, 2024

HYD: రాయితీ కోసం వాటర్ బోర్డు ఎదురుచూపు

image

గ్రేటర్ HYD సహా ఔటర్ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్న వాటర్ బోర్డుకు కరెంటు బిల్లు గుదిబండగా మారింది. పంపింగ్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో రూ.105 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు నెలకు బిల్లులు వస్తున్నాయి. అయితే వాటర్ బోర్డు మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో రాయితీ ఇచ్చి, యూనిట్‌కు రూ.3.95 వసూలు చార్జీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

News August 15, 2024

HYDలో 23 ప్రాంతాల్లో మరుగుదొడ్లు

image

గ్రేటర్ HYD పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణానికి 23 ప్రదేశాల్లో అనుమతులు వచ్చినట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పనులు చేపట్టేందుకు జోనల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు గ్రేటర్ వ్యాప్తంగా కుక్కల బెడద, కుక్క కాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.

News August 15, 2024

దేశమంతటా సంబరాలు.. HYDలో నిర్బంధం

image

వందల ఏళ్లు పరాయి పాలనలో మగ్గిన భారతీయులకు 1947 ఆగస్ట్ 15న విముక్తి లభిస్తే.. హైదరాబాద్‌‌లో మాత్రం నిర్బంధం కొనసాగింది.‌ కొందరు విద్యావంతులు రేడియో ప్రసారాల ద్వారా వాటిని తెలుసుకున్నారు. పైగా స్వాతంత్ర్యం శుక్రవారం వచ్చింది. ఆరోజు ఇక్కడ అన్నింటికీ సెలవు. దీంతో విద్యాసంస్థలు, దుకాణాలు బంద్ అయ్యాయి. ఉద్యమాలు చేసిన విద్యార్థులు, యువత సంబరాలు జరుపుకోలేకపోయారు.

News August 15, 2024

HYD: విద్యార్థులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వసతి గృహాల్లోని విద్యార్థులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కిటికీలు, తలుపులు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలు పంచాయతీ కార్యదర్శి లోకల్ బాడీ వారి సహకారం తీసుకోవాలన్నారు. వార్డెన్లతో ప్రతివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలపై ఆరాతీసి పరిష్కరించాలని ఆయన సూచించారు.

News August 15, 2024

HYD: కత్తిపోట్లకు బెదరలేదు.. ప్రతిష్ఠాత్మక పురస్కారం

image

విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకునే పోలీసులను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, రెండేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 7కత్తి పోట్లకు గురైనా.. తెగించి నిందితులను పట్టుకున్నారు. దీంతో ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పతకం ఆయనను వరించింది. దీనికి ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. నాడు మాదాపూర్‌లో మహిళ మెడలో చైన్ లాక్కెళ్లినవారిని పట్టుకునే క్రమంలో బొల్లారంలో ఆయనపై దాడిచేశారు.

News August 14, 2024

BREAKING.. HYD: బాలిక కిడ్నాప్.. రంగంలోకి స్పెషల్ టీమ్

image

రాయదుర్గం పీఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్‌కు గురైంది. స్కూల్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంబడే ప్రత్యేక టీమ్ గాలింపు చేపట్టింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలికను పోలీసులు గంటలో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.