India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.

IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాథ్ వర్క్ TiHAN పేరిట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి జులై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. ఈ కాంపిటీషన్లో మూడు రౌండ్లు ఉంటాయన్నారు. కాంపిటీషన్ మెటీరియల్ సైతం అందించే అవకాశం ఉందన్నారు. వెబ్‌సైట్ spr.ly/60114abzL ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

GHMCలో డిప్యూటీ కమిషనర్‌లు బదిలీ అయ్యారు. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు పొందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మంది ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లు పొందారు.

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.

సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని బోనాల జాతర నేపథ్యంలో మహాకాళి దేవస్థానాన్ని రేపు శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించనున్నట్లు దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీ.మనోహర్‌రెడ్డి తెలిపారు. రేపు ఉ.9గంటలకు వీరు మహాకాళి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో పాటు మంత్రి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

బీసీ గురుకుల పాఠశాలల్లో తరగతి గదులు, సీట్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారని దీంతో విద్యార్థులు సీట్లు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీట్ల సంఖ్యను పెంచాలని కోరుతూ ఆయన గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

ఓయూ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల LLB, మూడేళ్ల LLB ఆనర్స్ ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఐదేళ్ల BA LLB, ఐదేళ్ల BBA LLB, ఐదేళ్ల BCom LLB 2, 6, 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఓయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీపీఈడీ, డీపీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఆదివారం ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఈ రోజు జాతర కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. భక్తుల సందర్శనకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర రోజు మ.1 నుంచి 3 గంటల మధ్య శివసత్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.