India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ ఉత్కృష్ట సేవా పతకం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన గుండ్యా నాయక్‌ను వరించింది. విధి నిర్వహణలో 15 ఏళ్ల పాటు సేవ, అంకితభావంతో వృత్తి పరమైన నైపుణ్యంతో అనేక విజయాలు సాధించిన ఆయనను ఉత్కృష్ట సేవా పతకం 2025 వరించింది. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.
మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ ఇచ్చి గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.
పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు
ఫూటుగా మద్యం తాగి బండ్లు నడుపుతూ పట్టుబడిన వారు సామాజిక సేవచేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌లో చిక్కిన ముగ్గురికి మేడ్చల్ అత్వెల్లి కోర్టులో 2రోజులు, సుచిత్ర కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్, అవేర్నెస్, రోడ్లు మరమ్మతులులో పాల్గొనాలని ఆదేశించిందని తెలిపారు. శిక్ష అమలులో భాగంగా నిందితులు సుచిత్ర కూడలిలో పనులు చేశారు.
రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో ప్రవీణ్ కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.
Sorry, no posts matched your criteria.