India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్‌లో జరిగిన శ్రావణి సాహితీ, సాంస్కృతిక సమాఖ్య త్రిదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగ్గురు ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవి, అవధాని గండ్ర లక్ష్మణరావు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ, విశ్రాంత ఉపన్యాసకులు వంగపల్లి ప్రభాకర్ రావులకు ఈ పురస్కారాలు లభించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరు చేస్తున్న సాహిత్య సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
జిల్లాలో గత 12 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూరు మండలం పోచంపల్లిలో 16.3 మి.మీలు, గంగిపెల్లి 15.3, గట్టుదుద్దెనపెల్లి 7.8, జమ్మికుంట 14, కొత్తపల్లి 12.5, తనుగుల 15.8, ఇల్లంతకుంట మండలం మల్యాలో 8.3 మి.మీలు, కేశవపట్నం 13.3, తాడికల్‌లో 7.5 మి.మీల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల్లో వరంగల్ జిల్లా సంగెంలో 202.4 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది.
శంకరపట్నం మండలం రాజాపూర్‌కు చెందిన పిన్‌రెడ్డి శ్రీకాంత్(29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిపాలైన యువకుడు నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడాడు. రాజాపూర్ మాజీ సర్పంచ్ పిన్‌రెడ్డి వసంత- నరసింహారెడ్డి దంపతుల కుమారుడైన శ్రీకాంత్ చికిత్సకు రూ.లక్షలు దారాబోసినా ప్రాణాలతో బయటపడలేదు. ఈ ఘటనతో మృతుడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చేతివ్రాత(HAND WRITING) పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 6-10వ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 20, 25 తేదీల్లో, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు SEPT 7న KNR పద్మానగర్లోని పారామిత హెరిటేజ్ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి పోటీలు జరుగుతాయన్నారు. విజేతలకు అదేనెల 15న కలెక్టరేట్ ఆడిటోరియంలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు.
కరీంనగర్‌లోని సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారందరికీ ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, తద్వారా అనారోగ్యాలను నివారించవచ్చని కలెక్టర్ చెప్పారు.
వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన చిగురుమామిడిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రేకొండ గ్రామంలో ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఉదయం కిరాణం షాపుకు వెళుతున్న దుడ్డెల పోచవ్వ అనే వృద్ధురాలిపై పందుల గుంపు దాడి చేశాయి. ఈ క్రమంలో ఆమెను లాక్కెళ్లాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వృద్ధురాలిని 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతులు, పందులు, కుక్కల బెడద ఎక్కువైందన్నారు.
KNR బాలసదనంలో నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. బాలసదనం బాలికలతో మమేకమై వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. బాలికలు కలెక్టర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌కు మిఠాయిలు తినిపించారు. అనంతరం బాలసదనంలోని 16 మంది బాలికలకు, శిశు గృహాల్లో పెరుగుతున్న 9 మంది శిశువులకు సుమారు 100 కొత్త దుస్తులను కలెక్టర్ అందజేశారు.
వ్యవసాయ రంగంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో కరీంనగర్ జిల్లాకు రెండు అవార్డులు దక్కాయి. “ఇండో అగ్రి”, “సస్టైనబిలిటీ మ్యాటర్స్” సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన “సస్టైనబుల్ అగ్రికల్చర్ సమ్మిట్”లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తరఫున జిల్లా అధికారులు ఈ అవార్డులు అందుకున్నారు. వ్యవసాయ శాఖలో దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఎంపిక కావడం గమనర్హం.
మానకొండూరు నుంచి కరీంనగర్ వస్తున్న ప్యాసింజర్ ఆటో డ్రైవర్ కేబుల్ బ్రిడ్జి పై గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో మానకొండూరు మండలం లింగాపూర్ టి.నాగేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం తెలిపారు. జిల్లాలోని ఇప్పటివరకు సరిపడా యూరియా ఉన్నాయని, ఇంకా రావాల్సిన యూరియా క్రమంగా వస్తుందని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెంది ముందస్తు కొనుగోలు చేయక అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. వ్యవసాయ అధికారులు ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరాను రైతులకు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.