India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా బీర్ల పద్మ, ప్రధాన కార్యదర్శిగా కొట్టె అంజలి ఎన్నికయ్యారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్షపై రాజీలేని పోరాటం చేస్తామని, అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉంటూ జిల్లావ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు.

కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ పీజీ, పరిశోధక విద్యార్థుల క్యాంపస్‌లో అర్బన్ నక్సలైట్లు తిష్ట వేశారనే వార్తలతో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ప్లేస్‌మెంట్లు ప్రభావితమవుతాయని పలువురు విద్యార్థులు వీసీకి బుధవారం వినతిపత్రం అందజేశారు. అనుమానితుల అడ్మిషన్లు రద్దు చేసి, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే యూనివర్సిటీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల పరిశీలకునిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఏఐసీసీ నియమించించింది. నేటి నుంచి మూడు రోజులు ఆయన పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ, పార్టీ విజయానికి కృషి చేయనున్నారు. ఆయన వెంట కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ప్రచారానికి వెళ్లనున్నారు.

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్దేశించుకున్న రూ.60 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంలో మెజారిటీ వాటా వసూలైంది. ఇప్పటివరకు మొత్తం ఆదాయం రూ.50 కోట్ల మార్కును దాటినట్లు డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్ వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 2.07 కోట్లు ఖజానాకు చేరాయి. గడువు ముగియడంతో పన్ను చెల్లింపుదారుల నుంచి భారీ స్పందన లభించింది.

కరీంనగర్ జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఏప్రిల్ నుంచి ఎండల తీవ్రత పెరగనుండటంతో, వృద్ధులు, పేదలు ప్రతి నెలా క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయనుంది. అలాగే యాసంగి ధాన్యం నిల్వకు గోదాములను ఖాళీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు 18 కిలోల బియ్యం ఏప్రిల్‌లోనే అందనున్నాయి.

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి.. వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన అసభ్య సైగలు తీవ్ర దుమారం రేపగా, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు.

Sorry, no posts matched your criteria.