India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు ఏక్కటి సంజీవరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో చర్చించి త్వరలోనే కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ విజయశాంతి ఉద్యమకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో బుధవారం గ్రామ సభలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు జరిగిన సభలు రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”తో ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నగునూరు గ్రామ సభకు కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరై గ్రామస్తుల సమస్యలు ఆలకించి, అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లు చదివి అభిప్రాయాలు సేకరించారు.

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్ సెటీ ఇన్చార్జి శ్రీపాద స్వప్న పేర్కొన్నారు. 19-45సం.ల మహిళలు ఆధార్ కార్డ్, తెల్లరేషన్ కార్డ్ ఎస్ఎస్సీ మెమో, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ 2 పాస్ ఫోటోలు తిమ్మాపూర్‌లోని సంస్థ కార్యాలయంలో ఈనెల 6లోపు సమర్పించాలని తెలిపారు. నెలరోజుల శిక్షణలో ఉచిత భోజనం హాస్టల్ వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 30 వరకు పొడిగించామని KNR CP గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 7న టీఎస్‌కేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమేశ్ తెలిపారు. 18 ఏళ్లు పైబడిన యువత, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. SSC నుంచి పీజీ వరకు అర్హత కలిగిన వారికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనునట్లు వివరించారు.

కరీంనగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు కేక్ కట్ చేసి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, పారదర్శకతకు దారితీయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27కు అనాథ విద్యార్థులకు పాలిటెక్నిక్‌లలో ఉచిత ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. సివిల్, ఈఈఈ, కంప్యూటర్, ఈసీఈ కోర్సుల్లో సీట్లను మే 25లోపు కరీంనగర్ బాల రక్షా భవన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) ఫోన్ నంబర్ 7396424387 ను సంప్రదించాలని తెలిపారు.

పారాక్వాట్, దాని ఫార్ములేషన్ల అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వాడకాన్ని రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి బుధవారం తెలిపారు. కావున నేటి నుంచి ఫర్టిలైజర్ షాపుల్లో ఉన్న పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.