Karimnagar

News April 4, 2026

KNR: ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేద్దాం’

image

CKM కళాశాలలో పనిచేస్తూ ప్రభుత్వంచే టేకోవర్ అయి వివిధ ప్రభుత్వ కళాశాలల్లో నియామకం పొందిన 20 మంది అధ్యాపకులు KNR లో TGCGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కళాశాల విద్యా ఐకాస చైర్మన్ డా. కడారు సురేందర్ రెడ్డిని కలిసి సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె చిన్నా తదితరులున్నారు.

News April 3, 2026

KNR కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీఎల్‌సీ సత్తు మల్లేషం, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురయ్య త్యాగం రైతాంగ హక్కుల సాధనకు ప్రేరణగా నిలిచిందని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు.

News April 3, 2026

జిల్లా మాలమహానాడు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా మహేంద్ర వర్మ

image

జాతాయ మాల మహానాడు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆదేశాల మేరకు తాండ్ర మహేంద్ర వర్మని కరీంనగర్ జిల్లా ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేయాలని, ఉద్యోగుల సమస్యలపై సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు ఉద్యోగులను చైతన్య పరుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

News April 3, 2026

హనుమాన్ జయంతి.. కరీంనగర్‌లో ప్రశాంతం

image

హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీ పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. సీపీ గౌష్ ఆలం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ర్యాలీ ప్రశాంతంగా సాగింది.

News April 3, 2026

కరీంనగర్: 50 శాతం పెరిగిన చార్జీలు

image

మీసేవ కేంద్రాల్లో ధృవీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులపై యూజర్ చార్జీలు 50 శాతం పెంచుతూ ఐటీ, కమ్యూనికేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.45–55 మధ్య ఉన్న సర్టిఫికెట్ ధరలు ప్రస్తుతం రూ.80కి పెరుగగా, సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 190 కిపైగా కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 25 మంది దాకా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేస్తుండగా, ఎక్కువ మంది విద్యార్థులే కావటం గమనార్హం.

News April 2, 2026

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: కౌశిక్ రెడ్డి

image

శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ మండలం రాజపల్లి, సిర్సపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు సర్పంచ్‌‌లు కటుకూరి మల్లారెడ్డి, పోల్సాని రామారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

KNR: ఉద్యమకారుల హామీల అమలుకు వినతి

image

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు ఏక్కటి సంజీవరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో చర్చించి త్వరలోనే కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ విజయశాంతి ఉద్యమకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.