India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎవరైనా అనుకోకుండా అనుమానాస్పద, మోసపూరిత APK ఫైల్‌ను క్లిక్ చేసి లేదా ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఇలా చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.
1. వెంటనే మీ మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌కు మార్చండి.
2. అనుమానాస్పద APK ఫైల్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి/తొలగించండి.
3. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి మీ ఫోన్ నుండి ##002# డయల్ చేయండి.
4. 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయండి.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. వాట్సప్ గ్రూపుల ద్వారా నకిలీ APK పైళ్లను సర్కులేట్ చేస్తున్నారని, అలాంటి ఫైళ్లను ఓపెన్ చేసి, ఇన్‌స్టాల్ చేయవద్దని ఆయన సూచించారు. మోసపూరిత యాప్ లను ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని, అలా జరిగినప్పుడు వెంటనే https://www.cybercrime.gov.in సైబర్ క్రైమ్ వెబ్ సైట్ లో కానీ,1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తన బ్యాచ్‌మేట్, ఐపీఎస్ అధికారి చింత కుమార్‌ను కలిసేందుకు హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట గ్రామానికి ఆకస్మికంగా వచ్చారు. సెలవుపై స్వగ్రామంలో ఉన్న చింత కుమార్‌తో గౌష్ ఆలం ఆప్యాయంగా సమావేశమై, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత వృత్తి బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సీపీ చేసిన ఈ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం మానకొండూరులోని ఎస్సై సంజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుపాకులగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సంజీవ్ నక్సల్‌తో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారని సీపీ గుర్తుచేశారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి నిబద్ధతను, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు.
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని CP గౌష్ ఆలం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సాయం కోసం వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కంట్రోల్ రూం(PCR) 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ERSS) 112 నంబర్లను సంప్రదించాలన్నారు. సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు.
దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
KNR DCC అధ్యక్ష పదవి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈ పదవి కోసం శనివారం జరిగిన ఇంటర్వ్యూలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక MLA, AICC ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ మన్నె ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి సంబంధించిన తన ప్రణాళికలు, అభిప్రాయాలను ఆమె వివరించారు. జిల్లా స్థాయిలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.
కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో శనివారం జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
KNR కమిషనరేట్ పరిధిలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు CP గౌష్ ఆలం తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్న 301 మంది వాహనదారుల నుంచి మొత్తం రూ.64,39,715 జరిమానా వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగ్ చలానాలు కలిగిన వాహనదారులు వాటిని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేస్తామని CP హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.