India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చొప్పదండికి చెందిన మంచికట్ల కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా కుమార్ తండ్రి మంచికట్ల విట్టల్.. ఫుట్‌వేర్ షాప్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కుమార్ మాట్లాడుతూ.. తన తండ్రి కష్టపడి చదివించారని, తన ఆశయాలను వమ్ము చేయకుండా కృషి, పట్టుదలతో చదివానని ఈసందర్భంగా పేర్కొన్నాడు. కుమార్‌ను పద్మశాలి సంఘం అధ్యక్షుడు దండే రాజయ్య, దండే లింగన్న, దూసరాము అభినందించారు.
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర 41.5°C నమోదు కాగా, ఇందుర్తి, చిగురుమామిడి 40.1, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి 40.0, రేణికుంట 39.8, నుస్తులాపూర్ 39.7, ఖాసీంపేట 39.6, జమ్మికుంట 39.3, బురుగుపల్లి 39.1, వెంకేపల్లి 38.6, వీణవంక 38.3, కొత్తగట్టు 37.9, తాడికల్ 37.8, పోచంపల్లి 37.7, చింతకుంట, KNR 37.6, గట్టుదుద్దెనపల్లె, ఆసిఫ్నగర్ 37.3°C గా నమోదైంది.
KNRలోని కాశ్మీర్ గడ్డ రైతుబజార్ ఒక అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఇక్కడ ఒక వినూత్నమైన కొత్త కాన్సెప్ట్‌తో కూరగాయల సంతను ఏర్పాటు చేశారు. ఈ కూరగాయల సంతను ఏర్పాటు చేసింది.. రైతులో.. గ్రామీణ ప్రాంత ప్రజలో కాదు..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు. కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో ఎంపిక చేసిన 12ప్రభుత్వ పాఠశాలల నుంచి 60మంది విద్యార్థులతో ఏర్పాటు చేయించారు.
నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.
భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
వలస కార్మికుల పిల్లల చదువులు ప్రోత్సహిస్తామని, ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వలస కూలీల కార్మికుల యజమానులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎం.ఈ.ఓలు, ఇటుక బట్టీల యజమానులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డీ కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో పాటు భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు.
కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పెపర్ 1 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 19,425 మంది విద్యార్థులకు గాను 18,804 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 621 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
KTR, హరీశ్ రావు, తీన్మార్ మల్లన్న HYDలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పుల్లా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బీఆర్ఎస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.