India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.

ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. ‘అరైవ్-అలైవ్’ మూడవ దశలో భాగంగా ఆటో, రాపిడో డ్రైవర్లకు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 200 మంది మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రతి ఒక్కరూ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ కోసం బీఆర్ఎస్ హయాంలోనే రూ. 540 కోట్లు మంజూరయ్యాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ నుంచి రూ. 440 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ చేపడుతున్న సందర్భంగా మానేరు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని, నిధులు విడుదల చేయాలని ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.

కరీంనగర్ ఎల్ఎండీ జలాశయంలో నీటి నిల్వలు 7.292 టీఎంసీలకు పడిపోవడంతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ప్రతిరోజూ 55 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేసిన నగరపాలక సంస్థ, ఇకపై రోజు విడిచి రోజు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని,వృథా చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మిడ్ మానేరు నుంచి నీటి విడుదల లేకుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

కరీంనగర్ జిల్లాలో 16 అంబులెన్సులతో 108 సేవలు అత్యవసర సమయంలో అపర సంజీవనిగా నిలుస్తున్నాయి. 33 మంది సిబ్బంది, 35 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. గతేడాదిలో 23,275 మందిని ఆసుపత్రులకు తరలించగా.. రోడ్డు ప్రమాదాలు, గర్భిణుల తరలింపు, గుండె, శ్వాసకోశ సమస్యల కేసులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. వాహనాలు, పరికరాలను నిరంతరం తనిఖీ చేస్తూ నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులు పాల్గొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రికార్డు స్థాయిలో 3,758 కేసులు పరిష్కారమైనట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఇతర పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. చురుగ్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని, సహకరించిన ప్రజలను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.
Sorry, no posts matched your criteria.