Karimnagar

News March 28, 2026

మానేరు రివర్ ఫ్రంట్ పనుల పరిశీలించిన కలెక్టర్

image

కరీంనగర్ శివారులోని LMD రిజర్వాయర్ దిగువన శరవేగంగా సాగుతున్న ‘మానేరు రివర్ ఫ్రంట్’ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె, ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, వ్యయం, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు రజిత, రాధతో మాట్లాడి నిర్మాణ వ్యయం, ప్రభుత్వ బిల్లుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

News March 27, 2026

KNR: భారీ బ్యాంకు కుంభకోణం.. రూ.100 కోట్ల గోల్‌మాల్‌!

image

కరీంనగర్ నగరంలోని ఓ ప్రముఖ బ్యాంకులో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు నకిలీ ఖాతాలకు మళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిధులు హవాలా మార్గంలో తరలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2026

పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రకం: బండి సంజయ్

image

పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే వ్యాట్ (VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు. తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News March 27, 2026

కరీంనగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళల పొడిగింపు

image

కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలను ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన సమయానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 27, 2026

ముగిసిన కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు

image

కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 938 సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా శివ కుమార్, శ్రీధర్ రావు, గీతా రాణి, జనరల్ సెక్రటరీగా కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా దేవా కిషన్, కోశాధికారిగా స్వామి విజయం సాధించారు. కొత్త కమిటీ, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలని సభ్యులు కోరారు.

News March 26, 2026

KNR: అసెంబ్లీ ముట్టడికి యత్నం.. DYFI నేతల అరెస్టు

image

యువజన హక్కుల సాధనకై DYFI పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలైన 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా ప్రభుత్వం యువతను వంచిస్తోందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.

News March 26, 2026

KNR: గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల

image

ఎండాకాలం దృష్ట్యా రైతుల పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం కోరారు. దీంతో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నీటిని అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.