India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.42% పోలింగ్ కాగా, అత్యధికంగా చొప్పదండిలో 83.66% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ రూరల్లో 84.67%, రామడుగులో 82.05%, గంగాధరలో 78.70%, కొత్తపల్లిలో 79.19% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి.

గంగాధర మండలంలోని కూరిక్యాల, గంగాధర సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటు ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును, ఓటింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎంపీడీవో డి.రాము, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3-దఫాలుగా 2వ ఆర్డినరీ ఎలక్షన్స్ నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రకటించారు. మీ సంస్థలలో పనిచేసే కార్మికులకు 11, 14& 17 తేదీలలో (సంబంధిత మండలాలలో పోలింగ్ రోజున) వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరికి తెలియజేశారు. ఈ సెలవును దుకాణాలు, సంస్థల చట్టం 1988, సెక్షన్ 13 ప్రకారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 53.98% పోలింగ్ జరగ్గా, కరీంనగర్ రూరల్‌లో 49.64%, గంగాధరలో 45.16%, కొత్తపల్లిలో 46.19%, రామడుగులో 40.83% చొప్పున ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 53.98% పోలింగ్ జరగ్గా, కరీంనగర్ రూరల్‌లో 49.64%, గంగాధరలో 45.16%, కొత్తపల్లిలో 46.19%, రామడుగులో 40.83% చొప్పున ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా చొప్పదండిలో 21.58 శాతం, కోతిపల్లిలో 18.31 శాతం పోలింగ్ జరగగా, కరీంనగర్ రూరల్లో 17.76 శాతం , గంగాధరలో 13.35 శాతం, రామడుగులో అత్యల్పంగా 12.59 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లా మొత్తం మీద 15.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి కాస్త బద్దకిస్తున్నట్లు కన్పిస్తోంది. యువత మాత్రం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటేసేందుకు ఓటర్లు వస్తుండడంతో పల్లెల్లో సందడి నెలకొంది.

కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 5 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి (16), రామడుగు (23), గంగాధర(33), కొత్తపల్లి (6), కరీంనగర్ గ్రామీణ(14) లలో జరగనున్నాయి. మొత్తం 92 గ్రామాలు ఉన్నాయి. ఎన్నికలలో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, ఇన్‌ఛార్జ్ కార్యదర్శి కే.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్, సివిల్, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులు సహా వివిధ కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.