Karimnagar

News April 15, 2026

KNR: కాలువలో పడి బాలుడి దుర్మరణం

image

కరీంనగర్ నగరంలోని చింతకుంట వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి హరీశ్ కుమార్ (15) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోగా, స్థానికుల సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News April 14, 2026

3 నెలలకోసారి అట్రాసిటీ సమావేశాలు: కలెక్టర్

image

దళితులపై అణచివేత ఘటనలను నివారించేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశాలను 3 నెలలకోసారి నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగరంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి సభలో ఆమె మాట్లాడారు. దళితుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రత్యేక కృషి జరుగుతోందని తెలిపారు.

News April 14, 2026

KNR: ‘ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి’

image

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్‌కు 7వ ర్యాంకు

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్‌లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. కరీంనగర్‌కు 6వ ర్యాంకు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 16726 మంది పరీక్ష రాయగా 11737 మంది పాసై 70.17 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1,449 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 822 మంది విద్యార్థులు పాసై 56.73 శాతంతో స్టేట్‌లో 24వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

KNR: మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహేష్

image

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన మేడి మహేష్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తనపై నమ్మకంతో నియమించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

News April 11, 2026

కరీంనగర్: కార్పొరేటర్‌పై అనర్హత పిటిషన్

image

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 12వడివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన BJPఅభ్యర్థి జయశ్రీపై అనర్హతపిటిషన్ దాఖలైంది. BRSఅభ్యర్థి గీత జిల్లాకోర్టును ఆశ్రయించారు. జయశ్రీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ అసంపూర్తిగా ఉందని, ఆస్తులు, అప్పులను పూర్తిగా వెల్లడించలేదన్నారు. ప్రతివాదులుగా కలెక్టర్, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఇతర అభ్యర్థులను చేర్చారు.