India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంకరపట్నం(M) కేశవపట్నంలో ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. గ్రామానికి చెందిన తన్నీరు రాంబాబు అనారోగ్యంతో మృతి చెందగా, వివిధ కారణాలతో కల్లేపల్లి పోచమ్మ, గొల్లిపెల్లి కనకయ్య మృతి చెందారు. ఒకేరోజు ముగ్గురు మృతిచెందగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో కూడా ఇలాంటి వరుస మరణాలు సంభవించడంతో ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు అనే కొత్త నానుడి ఏర్పడిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గురువారం జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం వివరాలు. జగిత్యాల జిల్లాలో పట్టభద్రులు 70.47%, టీచర్స్ 92.43% ఓటు వినియోగించుకోగా.. పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రులు 68.50%, టీచర్స్ 94.42%, కరీంనగర్ జిల్లాలో పట్టభద్రులు 64.64%, టీచర్స్ 89.92%, సిరిసిల్లలో పట్టభద్రులు 68.73%, టీచర్స్ 94.63% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 46,247 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 64.64 ఓట్ల శాతం నమోదైంది. అలాగే ఉపాధ్యాయ ఎన్నికలో 46,247 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పోలింగ్ 89.92 శాతం నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
కరీంనగర్ ముకరంపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్‌లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం కరీంనగర్‌లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు దూర్షెడ్ గ్రామానికి చెందిన శ్రీరామోజు అఖిల డల్లాస్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఆమె తెలిపారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ 34.61% శాతం, ఉపాధ్యాయుల ఓటింగ్ 58.35% నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాల ఇంచార్జి గా గోదావరిఖని కి చెందిన పోగుల రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేశ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీఐపై అవగాహన కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 18.88 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 34.98 శాతం నమోదు అయింది.
కరీంనగర్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డాక్టర్ స్ట్రీట్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్‌ను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్‌ను సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయన సతీమణి ప్రసన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోయినపల్లి పోలింగ్ కేంద్రంలో వారిరువురు ఓటు వేశారు. ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.