India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KNR జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.3°C నమోదు కాగా, మానకొండూర్ 42.3, గంగాధర 42.1, రామడుగు 41.9, తిమ్మాపూర్ 41.6, KNR 41.5, చొప్పదండి 41.4, చిగురుమామిడి 41.2, KNR రూరల్ 41.0, శంకరపట్నం, గన్నేరువరం 40.9, కొత్తపల్లి 40.5, వీణవంక 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్, ఇల్లందకుంట 39.6°C గా నమోదైంది. కాగా, మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. KNR, HZBD ఎమ్మెల్యేలు, చొప్పదండి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ సభ బీఆర్ఎస్కు కీలకం కానుంది.
శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
రాజన్న సిరిసిల్ల(D) చందుర్తి(M)లోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికర సమాధానం రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది, నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో పేపర్ దిద్దిన టీచర్ ఆశ్చర్యపోయారు. నేటికాలంలో కోడళ్ళకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో ఈ లేఖ తెలియజేస్తోంది.
వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ బ్యాంకింగ్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 67 మంది హాజరైనట్టు తెలిపారు.
విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. KNRభగత్‌నగర్‌కు చెందిన మెహర్‌తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్‌లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్‌పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 42.3°C నమోదు కాగా, గంగాధర 41.5, జమ్మికుంట 41.2, చిగురుమామిడి, గన్నేరువరం 40.8, రామడుగు 40.7, చొప్పదండి 40.6, హుజూరాబాద్, కొత్తపల్లి, సైదాపూర్ 40.2, తిమ్మాపూర్, కరీంనగర్ 40.0, కరీంనగర్ రూరల్ 39.7, వీణవంక 39.5, శంకరపట్నం 39.1, ఇల్లందకుంట 38.4°C గా నమోదైంది.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవదీప్ (22) గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ పాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.